HrithikRoshan:మీ అభిప్రాయం ఎంటీ..?

68
- Advertisement -

హృతిక్‌రోషన్ సైఫ్‌అలీఖాన్ కలిసి ప్రధానా పాత్రలో నటించిన సినిమా విక్రమ్ వేద. తమిళ హిందీలో రీమేక్ అయి గతేడాది విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి ఫ్లాట్‌ఫామ్‌లోకి వచ్చేసింది. ఈ సందర్భంగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ను రిలీజ్ చేశారు.

Also Read: పెళ్లిళ్ల పై దీపికా షాకింగ్ కామెంట్స్

ఈ పాత్ర గురించి ప్రేక్షకుల అభిప్రాయాన్ని అడిగారు. మీరంతా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూశారని నాకు తెలుసు. నేను ఈ సినిమాలో కొత్తగా చేయడానికి ప్రయత్నించాను. కానీ అది నాకు కాస్త ఇబ్బంది కలిగించింది. ఆ పాత్ర మిమ్మల్ని అకట్టుకుందా అని తెలుసుకోవాలనుకుంటున్నా అని చెప్పుకొచ్చారు. ఓటీటీలో  సినిమా చూసిన వాళ్లు నా పాత్రపై అభిప్రాయాన్ని పంచుకోండి అని అడిగారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నెటిజన్లతో పాటు సినీ ప్రముఖులు కూడా కామెంట్స్‌ చేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌ 30న విడుదలైన ఈసినిమా జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. రాధికాఆప్టే కీలక పాత్రలో నటించింది.

Also Read: అప్పుడు ఆమెకు 17, భర్తకు 7 ఏళ్లు

- Advertisement -