పూజాకి గురువుగా హృతిక్‌..

222
- Advertisement -

ఆకట్టుకునే అందంతో పాటు, అభినందించదగిన అభినయం కూడా ప్రదర్శించగల హీరోయిన్ పూజ హెగ్డే. తెలుగులో చేసిన మొదటి సినిమా ‘ముకుందా’ తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తరవాత తెలుగులో మంచి మంచి ఆఫర్లు వచ్చినా కూడా చైతన్యతో ‘ఒక లైలా కోసం’ మాత్రమే చేసి మిగతా వాటిని వద్దనుకుని బాలీవుడ్ బాట పట్టింది. కానీ అక్కడ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో చేసిన మొదటి సినిమా ‘మెహెన్ జోదారో’ ఆశించినంతగా సక్సెస్ కాకపోవడం వలన ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు.

Hrithik Roshan turns Pooja Hegde's mentor

కానీ ఆ తర్వాత హృతిక్ రోషన్ ఆమెకు చాలా దగ్గర అయ్యాడని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పూజా కి హృతిక్ గురువుగా మారాడని అక్కడి మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. రీసెంట్ పూజ హెగ్డే తెలుగులో చేసిన దువ్వాడ జగన్నాథం అమె గ్లామర్ ను పరిచయం చేయడంతో అదే కొన్ని ఛాన్సులు తెచ్చి పెడుతోంది. అయితే బాలీవుడ్ లో ఛాన్సులు లేవు కాబట్టి.. ఆమె పరిస్థితిని అర్ధం చేసుకొని హృతిక్ రోషన్ ఓ రెండు ఆఫర్లని పూజ కోసం రికమండ్ చేస్తున్నాడట. ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఎదో రిలీషన్ ఉందంటూ గాసిప్స్ వినబడుతున్నాయి.

హృతిక్ కూడా తన భార్య సుసాన్ నె ఖాన్ కి విడాకులు ఇచ్చినప్పటి నుండి పూజతో క్లోజ్ గా ఉంటున్నాడనే కామెంట్స్ వినబడుతున్నాయి. కాని మనోడు చాలామంది హీరోయిన్లకు అలా గురువుగా వ్యవహరిస్తాడు కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకోవద్దు అంటున్నారు బాలీవుడ్ పెద్దలు.

- Advertisement -