అన్నీ హృతికే చేశాడు: కంగనా

223
Hrithik Roshan, Kangana Ranaut's star wars
- Advertisement -

హృతిక్‌ రోషన్‌, కంగనాల మధ్య వివాదం ముగిసిపోయిందనుకుంటే, దాన్ని మళ్లీ వెలికితీసింది బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌. ఈ నేపథ్యంలో అతడే నన్ను ఇష్టపడ్డాడు, అతడే నన్ను మోసం చేశాడంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

తన భార్య సుసానే ఉండగానే హృతిక్‌ తనను ఇష్టపడ్డాడని, వారిద్దరి విడాకుల తరువాత కూడా అతడు తనను ఇష్టపడుతున్నానని చెప్పాడని కానీ, ఆ తరువాత తనను వదిలించుకున్నాడని, దీంతో చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చింది కంగనా.

  Hrithik Roshan, Kangana Ranaut's star wars
ఇక తమ మధ్య ఉన్న బంధం గురించి బయటకు చెప్పినప్పుడు తనకు బెదిరింపులు మొదలయ్యాయని, దీంతో మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే, హృతిక్‌ కుటుంబం ఆ కమిషన్‌నూ కూడా కొనేసిందని తెలిపింది.

అంతేకాకుండా ఓ బాలీవుడ్‌ నటి కూడా ఈ విషయంలో తనకు హెచ్చరికలు చేసిందని, తనను ఇంటికి పిలిచిపించుకొని, “ఈ విషయాన్ని పెద్దది చేయకు. వారు చాలా ధనవంతులు, నిన్ను ఏమైనా చేయగలంటూ” వార్నింగ్‌ ఇచ్చిందని పేర్కొంది. దీంతో మరోసారి హృతిక్‌, కంగనాలు బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారారు.

- Advertisement -