హృతిక్, బన్నీ ట్వీట్స్ వైరల్

54
- Advertisement -

ఎన్టీఆర్ వారసుడిగా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న జూ. ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా ఎన్టీఆర్ కి ప్రత్యకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. గత కొన్ని రోజులుగా జూ.ఎన్టీఆర్ వార్-2 సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా, నేడు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా.. హృతిక్ రోషన్ ట్వీట్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్ డే తారక్. ఈ ఏడాది ఆనందంగా, యాక్షన్‌గా ఉండాలని కోరుకుంటున్నా. యుద్ధభూమిలో నిన్ను కలవడానికి వెయిట్ చేస్తున్నాను. పుట్టిన రోజు శుభాకాంక్షలు మిత్రమా’ అంటూ హృతిక్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

తారక్ బర్త్ డే నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేష్ ‘హ్యాపీ బర్త్ డే తారక్. నీ అప్ కమింగ్ సినిమాలకు ఆల్ ది బెస్ట్. నువ్వు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నా.’ అని ట్విట్టర్‌ లో పోస్టు పెట్టారు. అయితే, నారా లోకేష్ ట్వీట్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నువ్వు ట్వీట్ చేసినా నీకు మేము విలువ ఇవ్వం, నీకు ఎప్పటికీ ఓట్లు వేయడం అనేది జరగదు అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి పోటీ పడుతున్నారు.

Also Read: జూ. ఎన్టీఆర్ రియల్ హీరో కూడా

ఇక మరో స్టార్ హీరో అల్లు అర్జున్ సైతం ట్వీట్ చేస్తూ ‘హ్యాపీ బర్త్ డే బావ’ అని ఎన్టీఆర్ కి విషెస్ చెప్పాడు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇక చిన్నాచితకా హీరోలందరూ ఎన్టీఆర్ కి విష్ చేయడానికి పోటీ పడుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘దేవర’ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ పోస్టర్ కూడా ప్రస్తుతం వైరల్ గా మారింది.

Also Read: SURIYA:నీ మృతికి నివాళిగా రాస్తున్న అక్షరాలు కావు

- Advertisement -