రజనీ కూలిపై హృతిక్ ప్రశంసలు!

10
- Advertisement -

వార్ 2 మరియు కూలీ రేపు (ఆగస్టు 14, 2025) ప్రపంచవ్యాప్తంగా భారీ బాక్సాఫీస్ పోటీలో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు సినిమాలపై మంచి హైప్ ఉండటంతో, టికెట్ అమ్మకాలు, వసూళ్లపై అందరి దృష్టి నెలకొంది.

ఈ నేపథ్యంలో వార్ 2 స్టార్ హృతిక్ రోషన్… సూపర్ స్టార్ రజనీకాంత్‌పై ప్రశంసలు గుప్పించారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన హృతిక్.. నా నటనా ప్రస్థానంలో తొలి అడుగులు మీ పక్కనే వేశాను. మీరు నా మొదటి గురువులలో ఒకరు రజనీకాంత్ సర్… ఇంకా నేటికీ నా ప్రేరణ, ప్రమాణం. తెరపై మీ 50 ఏళ్ల ప్రయాణానికి హృదయపూర్వక అభినందనలు అని తెలిపారు.

చాలామందికి తెలియకపోవచ్చు కానీ, చిన్న వయసులో హృతిక్ 1986లో వచ్చిన రజనీకాంత్ హిందీ చిత్రం భగవాన్ దాదా లో ఆయనతో కలిసి నటించారు.బాక్సాఫీస్ పోటీకి ముందు రజనీకాంత్‌పై హృతిక్ చేసిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

Also Read:భద్రాద్రి దేవస్థానానికి ఐఎస్ఓ సర్టిఫికెట్

 

- Advertisement -