26న హౌరా బ్రిడ్జ్‌… వస్తోంది

203
Howrah Bridge Release on 26th jan
- Advertisement -

అందాల రాక్షసి హీరో రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం హౌరా బ్రిడ్జ్. రేవన్ యాదు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలె సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తిచేసుకుంది. డిసెంబర్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సిఉన్న అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతువచ్చింది.

ఈ నేపథ్యంలో సినిమా విడుదల డేట్‌ను అనౌన్స్ చేస్తూ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. రిపబ్లిక్ డే జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. పోస్టర్‌లో హీరో,హీరోయిన్స్‌లను చూస్తే రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కినట్లు తెలుస్తోంది.

howrah bridge

బ్రిడ్జ్ నేపథ్యంలో సాగే ఇంట్రస్టింగ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కిందని దర్శకుడు రేవన్ తెలిపారు. అందుకే హౌరా బ్రిడ్జ్ అని పెట్టామన్నారు. సెన్సార్ సభ్యుల నుంచి కూడా ఈ చిత్రానికి మంచి ప్రశంసలు వచ్చాయని తెలిపారు. మొత్తంగా రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న హౌరా బ్రిడ్జ్‌ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి..

- Advertisement -