ఇండియన్ ఓవర్‌సీస్ కాంగ్రెస్ చైర్మెన్ సామ్ పిట్రోడో మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతంలో ఉన్న వాళ్లు ఆఫ్రికన్లుగా, తూర్పున ఉన్నవాళ్లు చైనీయులుగా, పశ్చిమంలో ఉన్నవాళ్లు ఆరబ్బులుగా కనిపిస్తున్నారని ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 75 ఏళ్లుగా ప్రజలు సంతోషకర వాతావరణంలో బ్రతికారని, అక్కడక్కడ చిన్నచిన్న స్పర్థలు తప్ప ఏమీలేవని అన్నారు. భారత్ భిన్నత్వ దేశమని, కానీ అందరూ కలిసికట్టుగా ఉంటారని, తూర్పున ఉన్నవాళ్లు చైనీయులుగా, పశ్చిమంలో ఉన్నవాళ్లు అరబ్బులుగా, ఉత్తరంలో ఉన్నవాళ్లు శ్వేతజాతీయులుగా, దక్షిణంలో ఉన్న వాళ్లు బహుశా ఆఫ్రికన్లుగా కనిపిస్తారని పిట్రోడా పేర్కొన్నారు.
భారత దేశ ప్రజలు భిన్న భాషలను, మతాలను, ఆహారాన్ని, ఆచారాలను గౌరవిస్తారన్నారు. ఇటీవల వారసత్వ పన్ను గురించి కామెంట్ చేసి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
Also Read:జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు..సమాధానం చెప్పగలరా?