ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సప్. ఎన్నో ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్‌తో వినియోగదారులకు దగ్గరవుతున్న వాట్సాప్ ఇటీవలె కాల్ వెయిటింగ్ ఆప్షన్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
అయితే వాట్సాప్‌లోని ఆప్షన్లలో ఒకటైన స్టేటస్ ఆప్షన్‌లోని వీడియోలు,ఫోటోలు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం మాత్రం ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. కేవలం 24 గంటలు మాత్రమే కనిపించే వాట్సాప్ స్టేటస్ పోటోలు,వీడియోలను ఇకపై ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
() మీ ఫోన్‌లో ఇంటర్నెట్ డేటాను ఆన్ చెయ్యండి
()వాట్సాప్ తెరచి, స్టేటస్‌లోకి వెళ్లండి
()మీరు ఎవరి స్టేటస్‌ని డౌన్‌లోడ్ చెయ్యాలనుకుంటున్నారో ఆ వీడియోని ఓసారి పూర్తిగా చూడండి.
()ఇప్పుడు మీ మొబైల్‌లోని ఫైల్ మేనేజర్ ఫోల్డర్ ఓపెన్ చెయ్యండి.
() సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. Show Hidden Files ఆప్షన్‌ను ఎనేబుల్ చేయండి.
()తర్వాత స్టోరేజ్‌లోకి వెళ్లి… వాట్సాప్ ఆప్షన్‌లోకి వెళ్లండి. అక్కడ మీడియా ఆప్షన్‌లో స్టేటస్ (.statuses) ఆప్షన్‌ను ఎంచుకోండి. అందులో వాట్సాప్ స్టేటస్‌లో మీరు చూసిన వీడియోలు, ఫొటోలూ ఉంటాయి.
లేదంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి థర్డ్ పార్టీకి చెందిన వాట్సాప్ స్టేటస్ డౌన్‌లోడ్ మేనేజన్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
() ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి… స్టేటస్‌లోకి వెళ్లండి.
() మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్న ఫ్రెండ్స్ స్టేటస్ లను పూర్తిగా చూడండి.
()ఇప్పుడు మీరు కొత్తగా ఇన్‌స్టాల్ చేసిన యాప్‌ను ఓపెన్ చెయ్యండి.
()అందులో మీరు చూసిన స్టేటస్ వీడియోలు, ఫొటోలూ ఉంటాయి. అవి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.