ఈ ఉరుకులపరుగుల జీవితంలో అందరూ రకరకాల టెంక్షన్స్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఆఫీస్ ఒత్తిడి, ఇంటి సమస్యలు, లవ్ ప్రాబ్లమ్స్, గొడవలు, అనారోగ్యం, ఇలా ప్రతీది ఇప్పుడు సమస్యగా మారింది. వీటి గురించి ఆలోచిస్తే మనిషి ఇంకా క్షీనిస్తాడని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అందుకే వాటినుండి రిలీవ్ పొందడానికి నిపుణులు చెప్తున్న కొన్ని మార్గాలను తెలసుకుందాం.
* ఈ ఫాస్ట్ జనరేషన్ లో మెడిటేషన్ ను మనిషి మర్చిపోతున్నాడు. దీని వలన ఉపయోగం ఉంటుందా అని ప్రశ్నించే బదులు మెడిటేషన్ ను రోజూ ప్రాక్టీస్ చేసి చూడండి. అది మానసినకంగా ఎంతో ఉపశమనం ఇస్తుంది.
* అలాగే రోజు లేవగానే కొంచె సేపు వ్యాయామం చేయండి. ఇలా చేయడం వలన శరీరం కొంచెం తేలిక అవుతుంది. ఫిజికల్ ఫిట్ నెస్ కూడా మనిషి మానసికంగా దృఢంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.
* ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, తినడం మానేయండి. ఇవి ఉన్న టెంక్షన్ ను ఇంకా రెట్టింపు చేస్తాయి… మానసికంగా ఉత్సాహంగా ఉండాలంటే ఫ్రెష్ కూరగాయలను తిని చూడండి. మీకు ఇస్టమైన ఆటలు ఆడటానికి కొంచెం టైం కేటాయించుకోండి… మీ పిల్లలతోనో… లేకపోతే మీకు ఇష్టమైన వాళ్ళతోనో సరదాగా చిన్న చిన్న ఆటలు ఆడండి… ఇవి మీకు ఒత్తిడి నుండి ఉపశమనం ఇస్తుంది.
* మీకు పుస్తకాలు చదివే అలవాటు ఉంటే మంచి కామెడీ నవలలు చదవండి. లేదా ఉల్లాసాన్ని కలిగించే బుక్స్ ఏవైనా చదవండి. అవి మీకు ఎంతగానో ఉపయోగపడుతాయి. మంచి పాటలు కూడా టెంక్షన్స్ నుండి రిలీఫ్ ఇస్తాయి. మీకు ఇష్టమైన మ్యూజిక్ ను వినండి.. లేదా వింటూ పనిచేసుకోండి. టెంక్షన్ ఫ్రీ అయిపోతారు.
* కుటుంబ సభ్యులతో సరదాగా గడపండి. కుటుంభంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేట్టు చూసుకోండి. ఎన్నో టెంక్షన్స్ తో ఇంటికి వచ్చిన వారికి ఇల్లు ప్రశాంతంగా కనిపిస్తే.. ఎటువంటి టెంక్షన్స్ అయినా పారిపోతాయి… మనసుకి ప్రశాంతత వస్తుంది. ఇంట్లో ఉన్న మన వారితో కలిసి బోజనం చేయండం.. వారితో సరదాగా కబుర్లు చెప్పడం కూడా మంచి ఉల్లాసాన్నిస్తుంది.
Also Read:పెదవులు పగిలితే.. ఇలా చేయండి!