గ్యాస్ లీకయి పేలుడు సంభవించిన దుర్ఘటనలు ఎన్నో చూశాం. ఈ ప్రమాదం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.. ఎంతో ఆస్తి నష్టం కూడా జరుగుతుంది.. సిలిండర్ నుంచి మంటలు వెలువడుతున్నప్పుడు ఎలా వ్యవహరించాలో చాలా మందికి తెలియదు. కంగారులో ఏం చేయాలో తెలియక అనేక మంది ప్రాణాలు కోల్పుతున్నారు. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో గ్యాస్ లీకేజీని ఎలా ఆపాలో ప్రత్యక్షంగా వివరిస్తున్నాడు ఓ పోలీసు. గ్యాస్ లీకైనప్పుడు మంటలను అదుపులోకి తీసుకురావడం ఎలా అనే విషయాన్ని వివరిస్తూ ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను ఆయన పోస్ట్ చేశారు. దీనికి అనూహ్యమైన స్పందన లభించింది. రెండు రోజుల్లోనే 60 లక్షల మందికిపైగా ఈ వీడియోను వీక్షించారు.
ఢిల్లీలోని ఓ కాలనీ ప్రజలకు గ్యాస్ లీకేజీ గురించి వివరిస్తున్న వీడియోను కుమార్ నెట్‌లో పెట్టారు. గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు వ్యాప్తి చెందడానికి ఆక్సిజన్ ప్రధాన కారణం. కాబట్టి తడి గుడ్డను తీసుకొని దాన్ని సిలిండర్ చుట్టూ బిగుతుగా చుట్టేయడం వల్ల ఆక్సిజన్ అందక మంటలు తగ్గుముఖం పడతాయని కుమార్ ప్రాక్టికల్‌గా చేసి చూపారు. రెండు లక్షల మంది షేర్ చేసిన ఈ వీడియోను మీరు కూడా షేర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు మీ వంతుగా సహకరించండి.
https://youtu.be/50v7HKeHHXw