నేటి రోజుల్లో ఆస్తమా వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సాధారణంగా వయసు పైబడిన వారిలో కనిపించే ఈ సమస్య ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తోంది. ఇది దీర్ఘకాలికంగా వేధించే శ్వాస సంబంధిత వ్యాధి కావడంతో దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అయితే ఈ శీతాకాలంలో ఆస్తమా వ్యాధిగ్రస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే చలికాలంలో వచ్చే వాతావరణ మార్పుల సహజంగానే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఆస్తమా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. .
ముఖ్యంగా తినే ఆహార పదార్థాల విషయంలోనూ తాగే పానియాల విషయంలోనూ జాగ్రత్తలు తప్పనిసరి. ముఖ్యంగా ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి చల్లగా ఉండడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇంకా పాలు, ఇతర డైరీ ఉత్పత్తులకు కూడా దూరంగా ఉండడమే మంచిదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక చలికాలంలో వేడి వేడిగా కాఫీ లేదా టీ తాగే అలవాటు చాలమందికి ఉంటుంది. అయితే ఆ విషయంలో ఆస్తమా పేషెంట్లు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
టీ లేదా కాఫీ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడి ఆస్తమా తలెత్తే అవకాశం ఉంది. ఇక వాల్ నట్స్, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆస్తమా తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే వాటికి దూరంగా ఉండటం మంచిది. ఇంకా ఉదయాన్నే వ్యాయామం చేసే విషయంలో కూడా ఆస్తమా పెసెంట్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో వ్యాయామం చేయడం వల్ల శ్వాసపై ప్రభావం చూపుతుంది. తద్వారా ఆస్తమా తీవ్రత రెట్టింపవుతుంది. కాబట్టి ఈ వింటర్ సీజన్ లో ఆస్తమా వ్యాధిగ్రస్తులు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
Also Read:తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఆటా ఆహ్వానం