బెల్లం మంచిదేనా..ఇలా గుర్తించండి?

20
- Advertisement -

బెల్లం తీపి పదార్థమే అయినప్పటికి బెల్లం తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా బెల్లన్ని ఉపయోగిస్తుంటారు. బెల్లం తరచూ తినడం వల్ల శరీరానికి సరైన పోషకాలు మెండుగా లభిస్తాయని ఆహార నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా ఈ చలికాలంలో బెల్లం తింటే ఎంతో మేలట. సాధారణంగా చలికాలంలో జీవక్రియ మరియు రోగ నిరోధక శక్తి మందగిస్తుంది. అంతే కాకుండా జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల బెడద కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ సమస్యలన్నిటికీ బెల్లం ద్వారా విముక్తి లభిస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు.

ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి సమ్మేళనలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో తరచూ వేధించే కీళ్ల నొప్పులను నివారించడానిక్ బెల్లం లోని కాల్షియం, యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ ఆక్సిడెంట్లు చాలా బాగా పని చేస్తాయట.

అయితే మనం వాడే బెల్లం మంచిదేనా..ఎలా తెలుసుకోవాలి. ఓ టెస్ట్​ ట్యూబ్​లోకి పావు టీ స్పూన్​ బెల్లం తురుము వేయాలి.ఇప్పుడు ఆ ట్యూబ్​లోకి 3ml హైడ్రోక్లోరిక్​ యాసిడ్​ యాడ్​ చేయాలి.నిజమైన బెల్లం అయితే ఎటువంటి మార్పు ఉండదని, ఒకవేళ ఆ బెల్లంలో బేకింగ్​ సోడా కలిపితే బెల్లం మిశ్రమంపై బుడగలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read:రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే: హరీశ్‌

- Advertisement -