ఆకలి వేయట్లేదా..ఇలా చేయండి!

60
- Advertisement -

నేటి రోజుల్లో చాలమందికి ఆకలి మందగించే సమస్య ఎక్కువగా ఉంటుంది. ఆకలి మందగించడం వల్ల సమయాభావం లేకుండా భోజనం చేయడం.అదికూడా కొద్దిగా మాత్రమే ఆహారాన్ని ట్సుకోవడం. వంటివి చేస్తుంటారు. ఫలితంగా రోజురోజుకూ బరువు కోల్పోవడం, బలహీన పడడం వంటి సమస్యలు దరి చేరుతాయి. మన శరీర అవయవాలు సక్రమంగా పని చేయాలంటే పుష్టిగా ఆహార తినడం ఎంతో అవసరం. కానీ కొందరు పని ధ్యాసలో పడిపోయి ఆహారం తినే విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. కొందరికి మలబద్దకం, మైగ్రేన్, గుండె సమస్యలు, రుతుక్రమ సిండ్రోమ్,.. వంటి ఇతరత్రా ఆరోగ్య సమస్యల కారణంగా కూడా ఆకలి మందగిస్తుంది. ఈంకా మద్యపానం, ధూమపానం సేవించే వారిలో కూడా ఆకలి మందగిస్తుంది. కాబట్టి ఈ సమస్య నుంచి బయట పడడానికి ఆయుర్వేదంలో పలు చిట్కాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం !

వాము, ఉప్పు, కరక్కాయ పెచ్చులు, శొంఠి, పిప్పళ్ళు.. ఈ ఐదు పదార్థాలను సమభాగంలో తీసుకొని చూర్ణం చేసుకొని ప్రతిరోజూ మజ్జిగలో కలుపుకొని ఉదయాన్నే కొద్ది కొద్దిగా తీసుకోవడం వల్ల ఆకలి ఆకలి అధికమౌతుంది. తద్వారా ఆహారం వైపు దృష్టి మల్లుతుంది.ఇంకా ఒక టి స్పూన్ మిరియాల పొడి,అర టీ స్పూన్ బెల్లం పొడి, కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ ఉదయం సేవించడం వల్ల ఆకలి లేమి సమస్య దురమౌతుంది. అర టీ స్పూన్ అల్లం రసంలో కొద్దిగా రాక్ సాల్ట్ వేసి భోజనానికి అరగంట ముందు సేవించడం వల్ల ఆకలి పెరుగుతుంది. కప్పు నీటిలో కొద్దిగా ఉసిరి రసం, నిమ్మరసం, తేనె వంటివి కలిపి ప్రతిరోజూ సేవించిన ఆకలి లేమి సమస్య దురమౌతుంది. ఇంకా ఒక టీ స్పూన్ నిమ్మరసంలో రెండు టీ స్పూన్ ల వాము కలిపి ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఆ మిశ్రమాన్ని కలిపి ఉదయాన్నే పడగడుపున సేవించడం ద్వారా కూడా ఆకలి బాగా పెరుగుతుంది.

Also Read:ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ‘మునగ లడ్డూ’!

- Advertisement -