కల్తీ మిరియాలని ఇలా గుర్తించండి!

9
- Advertisement -

కల్తీ.. ఈ పేరు వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. తినే వస్తువుల దగ్గరి నుండి వాడే సబ్బులు, ఆయిల్ ఇలా ఏ వస్తువైనా కల్తీ కావాల్సిందే. ఈ క్రమంలో ఏది నిజమైందో తెలుసుకోవడం చాలా కష్టం. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే కొన్ని తినే పదార్థాలు అసలువా, కల్తీవా తెలుసుకోవచ్చే. ముఖ్యంగా ఆరోగ్యానికి వరప్రదాయని లాంటి మిరియాల కల్తీని ఇలా గుర్తించవచ్చు.

మిరియాలు పొడి గా చేసుకోని, పెరుగులో కలుపు కొనితగితే జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది. మిరియాలు, వేపకు, నీళ్ళు ఈ ముండింటిని కలిపి మిక్సీ వేసి ఆ తరువాత ఆ నీళ్ళు వడకట్టి తాగితే శరీరం లో దురదలు మట్టు మాయం అవుతాయి. మిరియాలు పొడి చేసి తేనెలో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. పొట్ట ఉబ్బరం తగ్గించే గుణాలు మిరియాలలో పుష్కలంగా ఉన్నాయి.చిగుళ్ల వాపు,నోటి నుంచి రక్తం కారడం వంటి సమస్యలు బాధిస్తుంటే చిటికెడు రాళ్ల ఉప్పు , మిరియాల పొడి మిశ్రమాన్ని చిగుళ్లకు రాసి గోరు వెచ్చని నీటితో పుక్కిలిస్తే ఉపశమనం లభిస్తుంది.

అయితే ఇలాంటి మిరియాలను కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు కొంతమంది. మిరియాలకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కొంతమంది బ్లాక్‌ బెర్రీ, బొప్పాయి గింజలు లాంటివి కలుపుతున్నారు.

Also Read:శంకర్‌తో పని చేయడం అదృష్టం..!

కల్తీ మిరియాలని ఇలా గుర్తించవచ్చు. కొన్ని మిరియాలను టేబుల్‌పై ఉంచి బొటనవేలితో నొక్కాలి. ఒరిజినల్ మిరియాలు గట్టిగా ఉంటాయి..అంత సులభంగా విరగవు. ఒకవేళ విరిగితే, అందులో ఎండిన బ్లాక్‌బెర్రీ పండ్లను కలిపినట్లు అర్థం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మిరియాల్లోని బొప్పాయి గింజలను గుర్తు పట్టేందుకు, ఒక గ్లాసు నీటిని తీసుకోవాలి. అందులో కొన్ని మిరియాలను పోయాలి. ఎలాంటి కల్తీ లేని స్వచ్ఛమైన మిరియాలు నీటి అడుగు భాగానికి చేరుకుటాయి. అదే బొప్పాయి గింజలు, ఇతర కల్తీ పదార్థాలు కలిపి ఉంటే నీటిపై భాగంలో తేలతాయని నిపుణలు సూచిస్తున్నారు.

NOTE : ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి ఆరోగ్య సమస్యలు న్న వైద్యులను సంప్రదించాల్సిందే.

- Advertisement -