క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల బలం వస్తుంది అని పెద్దలు చెబుతుంటారు. క్యారెట్ జ్యూస్ కాకుండా పచ్చి క్యారెట్ అంటే కూడా చాలా మందికి ఇష్టం. క్యారెట్ తినడం ఆరొగ్యానికి మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. చాలామంది క్యారెట్ కర్రీ చేసుకొవడం కన్నా జ్యూస్ ఎక్కువగా తాగుతారు. క్యారెట్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. శరీర ఆరోగ్యానికి కూడా క్యారెట్లు మేలు చేస్తాయి. క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల ఎన్ని రకాల లాభాలున్నాయో ఓ సంస్ధ సర్వే చేసి చెప్పింది. ఆ లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.
మహిళలు రోజు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగితే బ్రెస్ట్ క్యాన్సర్ బారినుండి ఉపశమనం పొందవచ్చు. బాడీలో ఎటువంటి క్రిములు ఉన్నా వాటి బారి నుంచి తప్పించుకొవచ్చు. క్యారెట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. క్యారెట్ తినడం వల్ల కంటి చూపును మెరుగుపరుస్తుంది. సైట్ రాకుండా కాపాడుతుంది. శరీర నిరోధక శక్తిని పెంచుతుంది. క్యారెట్లో పోటాషియం, యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. చర్మంపై ఉండే మచ్చలు, మెటిమలను దూరం చేస్తాయి.
ఇక క్యారెట్ జ్యూస్ రోజు తాగడం వల్ల హైబీపి నుంచి ఉపశమనం పొందవచ్చు. రక్తం సరాఫరా సక్రమంగా జరగుతుంది. సిగరెట్ తాగే వారు రోజు ఈ జ్యూస్ ను తాగడం వల్ల ధూమపానం చేయడం వల్ల వచ్చే నష్టాల నుంచి ఉపశమనం పొందవచ్చు.
కిడ్నిలను ఆరోగ్యంగా ఉంచడంలో క్యారెట్లు బాగా ఉపయోగపడుతాయి. అంతేకాకుండా కిడ్నిలపై ఒత్తిడి తగ్గుతుంది. కిళ్లనొప్పులు ఉన్నావారికి నొప్పుల బారినుంచి తప్పించుకునేందుకు క్యారెట్ జ్యూస్ బాగా పనిచేస్తుంది.
Also Read:లబ్దిదారులే స్టార్ క్యాంపెయినర్లు!