మామూలుగా క్రికెట్, ఫుట్‌బాల్ వంటి మ్యాచ్‌లను కోట్ల సంఖ్యలో అభిమానులు వీక్షిస్తుంటారు. కానీ పెళ్లిలను ఎవరైనా.. వీక్షిస్తారా..? సినిమా పెళ్లి కూడా కాదు.. రియల్ పెళ్లి. ఈ రియల్ రాయల్ పెళ్లిని ప్రపంచ వ్యాప్తంగా 190 కోట్ల మంది చూశారంటే మీరు నమ్ముతారా…? వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా.. రాయల్ వెడ్డింగ్‌ను ప్రపంచ వ్యాప్తంగా 190 కోట్ల మంది వీక్షించినట్లు ఓ మీడియా రిపోర్ట్‌లో తేలింది.
విన్డ్సర్ కాజిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్‌లో జరిగిన ప్రిన్స్ హ్యారీ, మేగన్ మార్కెల్ పెళ్లిని బ్రిటన్ రాణితో పాటు 600 మంది స్పెషల్ గెస్టులు వీళ్ల పెళ్లిని ప్రత్యక్షంగా చూశారు.మరోవైపు నేడు వధూవరులు గుర్రపు బగ్గీలో వెళ్తుంటే చూడడానికి లక్ష మంది రావడం మరో విశేషం. అయితే రాయల్ వెడ్డింగ్‌ను గ్రాండ్ సెర్మనీగా జరిపిన ప్రతి ఒక్కరికీ రాజకుంటుంబం కృతజ్ఞతలు తెలిపింది. ముఖ్య అతిథులుగా ఓప్రా విన్ ఫ్రె, సెరెనా విలియమ్స్, జార్జ్ క్లూనీ, డేవిడ్ బెక్ హామ్, ప్రియాంకా చోప్రా ఉన్నారు. ఈ రాయల్ కొత్త జంట ప్యాలెస్‌లోని నాటింగ్ హోమ్ కాటేజ్‌లో ఉండనుంది.