గుండెపోటు ఎన్నిసార్లు రావొచ్చో తెలుసా?

12
- Advertisement -

గుండెపోటు ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరిలో కామన్ అయిపోయింది. గుండెపోటు రావడానికి అనేక కారణాలున్నాయి. మనం తీసుకునే ఆహారం దగ్గరి నుండి, వ్యాయామం వరకు అన్ని జాగ్రత్తలను పాటిస్తే నిద్రలో గుండెపోటు ప్రమాదం నుండి బయటపడవచ్చు.ప్రధానంగా నిద్రలో గుండెపోటు రావడానికి కారణం అధిక కొలెస్ట్రాల్. శరీరంలో చెడు కొవ్వు పెరిగిపోతే అనారోగ్య సమస్యలు తలెత్తి క్రమేపీ హార్ట్ ఎటాక్‌కు దారి తీయవచ్చు.

అయితే ఒక వ్యక్తి గుండెపోటును ఎన్నిసార్లు తట్టుకోలగడనే విషయాన్ని పరిశీలిస్తే.. అది ఆ వ్యక్తి ఆరోగ్యం, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. డెపోటు అనేది గుండెకు రక్త సరఫరాలో ఆకస్మిక అంతరాయం కారణంగా ఏర్పడే అత్యవసర వైద్య పరిస్థితి. సరైన రక్త సరఫరా లేకపోతే..గుండె కండరాలు దెబ్బతింటాయి. దీని వల్ల ఆ వ్యక్తి మరణించే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి తన జీవితంలో మూడు సార్లు గుండెపోటుకు గురవుతాడు. మొదటి, రెండవ గుండెపోటు తర్వాత, సరైన సమయంలో చికిత్స, జీవనశైలిని మెరుగుపరిచినట్లయితే జీవించే అవకాశం ఎక్కువ. ఒకవేళ మూడోసారి గుండెపోటు వస్తే గుండె చాలా బలహీనంగా మారుతుంది. నాలుగోసారి గుండెపోటు వస్తే బ్రతకడం కష్టం.

గుండెపోటు ముందు వచ్చే ప్రధానమైన లక్షణాలు తీవ్రమైన ఛాతీ నొప్పి లేదా ఒత్తిడి -ఎడమ చేయి, మెడ లేదా దవడలో నొప్పి. అనారోగ్యకరమైన ఆహారం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు గుండె ధమనులలో అడ్డంకిని కలిగిస్తాయి. దీనివల్ల రక్త ప్రసరణ ఆగిపోతుంది. రక్తం గుండెకు చేరలేనప్పుడు గుండెపోటు వస్తుంది. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే గుండెపోటు నుండి బయటపడవచ్చు.

Also Read:KTR: ఛిద్రమవుతున్న చేనేత బ్రతుకులు

- Advertisement -