జంపు జిలానీ.. వివేక్‌ వెంకటస్వామి..!

473
ex mp vivek
- Advertisement -

వివేక్‌ వెంకటస్వామి… తెలంగాణ రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారుండరు. రాజకీయ నాయకునిగా, వ్యాపారవేత్తగా, ప్రముఖ మీడియా సంస్థ అధినేతగా ఈయన ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం ఈయన వ్యవహార శైలిని చూసిన వారందరూ ఈయన రాజకీయ జంపింగ్‌ జిలాని అంటున్నారు. ఎందుకంటే స్వర్గియ దివంగత రాజకీయ నాయకుడు, కాంగ్రెస్‌ నాయకుడు జి. వెంకటస్వామి కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వెంకటస్వామి తన తండ్రి ఆశయ సాధనకు కృషి చేస్తానని పలు మార్లు చెప్పుకొచ్చాడు. వివేక్‌ తండ్రి వెంకటస్వామి రాజకీయ విలువలకు కట్టుబడి తన తుది శ్వాస విడిచే వరకు కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నారు. కానీ ఆయన బ్రతికుండగానే పార్టీ ఫిరాయింపులకు తెరలేపి, అవకాశవాద రాజీకయాల కోసం, పదవుల పందేరంలో యథేచ్చగా పార్టీలు మారి తన రాజకీయ స్వలాభం కోసం తన తండ్రి వేసిన పునాదుల మీద ఎదిగి, దళిత సామాజిక వర్గ రాజకీయనాయకునిగా తనకు తాను చెప్పుకునే వివేక్‌ వెంకటస్వామి రాజకీయ విలువలను పాటించ లేదనే చెప్పాలి.

కాంగ్రెస్‌ పార్టీ ఎంపీగా గెలిచి తెలంగాణ కోసం రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరానని చెప్పుకున్న వివేక్‌ 2014 ఎన్నికల సందర్భంలో టీఆర్‌ఎస్‌ పార్టీని వీడి తిరిగి కాంగ్రెస్‌లో చేరడం తెలిసిందే. తెలంగాణ కోసం రాజీనామా చేశానన్న వివేక్‌ టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో ఎందుకు చేరాడో ప్రతి ఒక్కరికి తెలిసిందే. రాజకీయ స్వలాభం కోసం, పదవే ప్రాణంగా బ్రతికే వివేక్‌ కు పార్టీలు మారడం వెన్నతో పెట్టిన విద్య. రాజకీయ స్వార్ధంతో రాహుల్‌ గాంధీ పిలుపు మేరకు తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరానని చెప్పుకున్న వివేక్‌ కు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు గట్టిగా బుద్ధిచెప్పారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన వివేక్‌, టీఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌ చేతిలో 2,91,158 ఓట్ల మెజార్టీతో ఘోరంగా ఓడిపోయాడు. రాజకీయ స్వలాభాల కోసం నేతలు పార్టీ మారుతుండొచ్చు. కానీ దానిని ప్రజలు హర్షించారు. 2014లో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో తన స్వార్ధం కోసం, తన వ్యాపారాభివృద్ధి కోసం, తన వ్యక్తిగత స్వలాభం కోసం తిరిగి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాడు. తాను టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి అధికారిక పదవిని అనుభవించాడు. తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవిచ్చి గౌరవించింది.

vivek

2019 లో దేశంలో జరిగిన సాధారణ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తనకు టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పెద్దపల్లి ఎంపీ టికెట్‌ వస్తుందని ఆశించిన వివేక్‌ కు సీఎం కేసీఆర్‌ పెద్దపల్లి టికెట్‌ ఇవ్వకపోవడంతో నిరాశకు గురైన వివేక్‌ టీఆర్ఎస్‌ పార్టీకి, తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నిజానికి వివేక్‌ కు ఎటువంటి రాజకీయ ప్రయోజనం, వ్యక్తిగత స్వార్ధం లేకపోతే టీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉండేవాడు. కానీ అలా జరగలేదు. తనకు టికెట్‌ ఇవ్వలేదన్న కారణంతో చెప్పులు మార్చినంత ఈజీగా పార్టీ మారాడు. తనకు టికెట్‌ ఇవ్వనంత మాత్రానా వివేక్‌ అవివేకంతో పార్టీ మారాల్సి ఉండాల్సింది కాదు.. తనకు అవకాశం వచ్చే వరకు వేచి చూడాల్సింది.. పదవే ప్రాణంగా బ్రతికే వివేక్‌ పదవిలో ఉన్నన్నాళ్లు పార్టీ, ని ప్రభుత్వాన్ని వేనోళ్లతో పొగిడి ఒక్కసారిగా పార్టీ మారగానే విమర్శించడం మొదలు పెట్టాడు. ఇక్కడే తెలిసిపోయింది వివేక్‌ వెంకటస్వామి నిజ స్వరూపం. పదవే పరమావధానిగా భావించే వివేక్‌ వెంకటస్వామి రాజకీయ అండ లేకపోతే ఉండలేడు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ చెంత చేరడమే వివేక్‌ వెంకటస్వామి నైజం. అది ఏపార్టీనా కావచ్చు… అధికారం ఎక్కడ ఉంటే తాను అక్కడ ఉండాలనే కోరిక వివేక్‌ వెంకటస్వామిలో మెండుగా ఉంటుందని అతడి వ్యవహార శైలిని చూస్తే మనకు అర్ధమవుతుంది.

టీఆర్‌ఎస్‌ పార్టీకి దూరమైన వివేక్‌ కు రాజకీయ అండ కావాలనే ఉద్దేశ్యంతో బీజేపీ పార్టీ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీలు మారడం అతనికి కొత్తేమి కాదు కదా… ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తాను బీజేపీలో చేరాలని వివేక్‌ భావించవచ్చు. కానీ బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మారిస్తే తన ప్రతిష్ట దిగజారుతుందని వివేక్‌ వెంకటస్వామి గ్రహించుకోవాలి. నిజంగా వివేక్‌ వెంకటస్వామి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉంటే రాజకీయ పదవే ఉండాల్సిన అవసరం లేదు. మంచి మనసుతో కూడా ప్రజలకు సేవ చేయవచ్చు. కానీ అధికారం రుచి మరిగిన వివేక్‌ వెంకటస్వామి పదవి లేకపోతే ఉండలేని మనస్తత్వం కలవాడే కాబట్టి అధికారంలో ఉన్న బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. పార్టీలు మారడం వివేక్‌ కు కొత్తేమి కాకపోయినప్పటికీ ఇలా మాటిమాటికి అధికార కాంక్షతో పార్టీలు మారిస్తే ప్రజల్లో చులకన అవుతానని ఆయన గ్రహించుకోవాలని, పోరాటాల పునాదుల మీద సాధించుకున్న స్వరాష్ట్రంలో ఇటువంటి గోడమీది పిల్లిలాంటి నాయకులను తెలంగాణ ప్రజలు హర్షించరని వివేక్‌ తెలుసుకోవాలని, రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయి. తను చేసిన త ఇప్పటికైనా వివేక్‌ వెంకటస్వామి తన తీరును మార్చుకుంటే బాగుంటుందని పలువురు కోరుతున్నారు.

- Advertisement -