ఆ ఒక్కటి తప్ప.. అన్నీ చేశాడట !

200
How prabhas enjoys after hectic baahubali ?
How prabhas enjoys after hectic baahubali ?
- Advertisement -

సుదీర్ఘ బాహుబలి సినిమా తరువాత సుజిత్ డైరెక్షన్ లో సాహో లో ప్రభాస్ నటిస్తున్నాడనే విషయం తెలిసిందే. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ విదేశాల్లోనే ఎక్కువగా గడిపాడు. మరి ఈ సినిమా షూటింగ్ అయితే మొదలైంది కానీ, ప్రభాస్‌ లుక్‌కు సంబంధించిన ఫోటోలు మినహ సాహోకు సంబంధించిన వార్తలైతే భయటకు రాలేదు. అంతేకాదు బాహుబలి విడుదల తరువాత ప్రభాస్‌.. అమెరికాలో విశ్రాంతి తీసుకున్నాడు. మరి ఆ సినిమా నుంచి బయటపడగానే ప్రభాస్ ఏం చేశాడు? ఎలా రిలాక్సయ్యాడు? ఈ విశేషాల్ని ఓ నేషనల్ డైలీతో పంచుకున్నాడు యంగ్ రెబల్ స్టార్.

‘బాహుబలి’ సినిమా ముగిశాక ఏం చేశారు అని అడగ్గా.. ముందు తాను చేసిన పని.. జుట్టు కత్తిరించుకోవడమన్నాడు ప్రభాస్‌. అంత పొడవాటి జుట్టుతో అన్నేళ్లు కొనసాగడం చాలా ఇబ్బందిగా ఉండేదన్నాడు. ‘బాహుబలి-2’ విడుదలైన రెండు రోజుల తర్వాత అమెరికాకు వెళ్లిపోయానని.. అక్కడ సినిమా ఆలోచనల్ని పూర్తిగా పక్కన పెట్టేశానని చెప్పాడు ప్రభాస్‌. తన క్లోజ్ ఫ్రెండ్స్ నాతో పాటు వచ్చారని.. బీచ్ ముందు ఉన్న ఓ స్పెషల్ హౌస్‌లో రిలాక్సయ్యామన్నాడు..

అక్కడ సినిమాల గురించి ఆలోచించడం తప్ప ఇక అన్నీ చేశామన్నాడు ప్రభాస్‌.. తనకు మాములుగా ఇలాంటి పర్యటనలంటే ఇష్టమని.. పైగా నాలుగేళ్ల పాటు ఒకే సినిమా కోసం అంకితమై ఉండటంతో ఈసారి మరింతగా ఎంజాయ్ చేశానని ప్రభాస్ తెలిపాడు. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘సాహో’ సైంటిఫిక్ థ్రిల్లర్ కాదని.. ఇది యాక్షన్ ఓరియెంటెడ్ హైటెక్ మూవీ అని ప్రభాస్ చెప్పాడు.

ఇక‌ ఆగ‌స్ట్ 15న స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌ల‌తో సాహో లో ప్ర‌భాస్ ఫైన‌ల్ లుక్ ని విడుద‌ల చేయ‌నున్నార‌ట‌. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ లో విడుద‌ల కానున్న ఈ సినిమాలో నితిన్ ముఖేష్ విలన్ గా కనిపించనున్నాడు. త‌మిళ న‌టుడు అరుణ్ విజయ్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. హీరోయిన్ ను ఇంత వ‌ర‌కూ ఎవ‌రినీ తీసుకోలేదు. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో విడుద‌ల కానున్న‌ ఈ చిత్రం యూవీ బేన‌ర్ పై నిర్మిస్తున్నారు.

- Advertisement -