‘హౌస్’ ఆడియో రిలీజ్

261
- Advertisement -

జై,వసుంధర జంటగా నటుడు ఉత్తేజ్ శిశ్యుడు రాజుశెట్టి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న హారర్ కామెడీ ఎంటర్ టైనర్ “హౌస్ ” .బోయిన క్రిష్ణంరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో రిలీజ్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. శాశంక్ బాస్కరుని సంగీతం అందించిన ఈ చిత్రం బిగి సీడిని నిర్మాత దాము ఆవిష్కరించారు..ఈ కార్యక్రమానికి దర్శకుడు క్రాంతి మాధవ్ , నటుడు ఉత్తేజ్ , నిర్మాత ముత్యాల రాందాస్ , పద్మిని ,హీరో మానస్ ముఖ్యఅతిధులుగా హాజరై చిత్రయూనిట్ ను అభినందించారు..ఉత్తేజ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన అనుభవం తోనే సినిమా తీసానని అన్నారు.

House

ఆయనను నిత్యం గమనించడం వల్ల సినిమాకు సంబంధించిన ప్రతి విషయం పై అవగాహాన ఏర్పడిందని ..ఫైనల్ గా దర్శకుడు కావాలనే కల హౌస్ మూవీతో నేరవేరిందని దర్శకుడు రాజ్ శెట్టి తెలిపారు.మా సినిమాకు ఇండస్ట్రీ అతిరథ మహారథులు గెస్ట్ లుగా రావడం మా టీమ్ ను అభినందించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు..నా శిశ్యుడు రాజు శెట్టి దర్శకుడు చాలా ఆనందంగా ఉందని అంటే..హౌస్ చిత్ర యూనిట్ రిలీజ్ కు ఎటువంటి సహాయం కోరినా సహాకరిస్తామని దాము , పద్మిని ,ముత్యాల రాందాస్ తెలిపారు.

నటీనటులు : జై ,వసుంధర , యోగేష్ , కౌశిక , కవిత ,సందీప్ , ఆర్కే , బాష , సినిమాటోగ్రఫి :మహేష్ మట్టి , ఎడిటర్ : ధీరజ్ ఆర్ట్స్ , సంగీతం : శాశాంక్ భాస్కరుని , నిర్మాత :బొయన క్రిష్ణంరాజు , కథ ,మాటలు ,స్క్రీన్ ప్లే , దర్శకత్వం : రాజు శెట్టి.

DSC_00880088   unnamed

- Advertisement -