గొల్ల కురుమల కోసం వసతి గృహాలు..

383
- Advertisement -

రాష్ట్రంలోని గొల్ల-కురుమలకు ఇప్పటివరకు 23080 లక్షల గొర్రెలను పంపిణీ చేసామని ముఖ్యమంత్రి కల్లకుంట్ల చంద్రశేఖర్‌ రావు అన్నారు. గొర్రెల పంపిణీ పథకం కింద టార్గెట్‌గా పెట్టుకున్న 84 లక్షల గొర్రెలను ఎక్కడనుండి తెచ్చి పంపిణీ చేస్తారని తమను ఎద్దేవా చేసారని ఇంత పెద్ద ఎత్తున ఇప్పటికే పంపణీ జరగడం ఒక సమాధానమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అన్నారు. హైదరాబాద్‌ నగరంలో జరుగుతున్న అఖిల భారత కురుమల సమావేశానికి వచ్చిన వారిలో అన్ని రాష్ట్రాలకు చెందిన కొందరు ప్రతినిధులు ముఖ్యమంత్రిని ప్రగతి భవన్‌లో కలుసుకున్న సందర్బంగా సీఎం వారితో ఈ విధంగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిని కలిసిన వీరందరూ రాష్ట్రంలో గొల్ల-కురుమలకు ప్రభుత్వం చేపటిన పథకం పట్ల హర్షం వెలిబుచ్చి ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా అభినందించారు.

ముఖ్యమంత్రిని కలిసిన వారిలో కర్నాటక మంత్రులు రేవన్న,బందప్ప,ఎమ్యెల్యే ప్రకాష్‌ వార్తుర్‌,మహారాష్ట్ర మంత్రులు మహదేవ జంకార్‌,రాం షిండే,ఎమ్యెల్యే వీ రామారావు,ఢిల్లీ వాటర్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ దినేష్‌ మొహారియా,తమిళనాడు కురుమ సంఘానికి చెందిన ఆర్‌.కృష్ణమూర్తి,ఎం.బి.సి కార్పోరేషన్‌ చైర్మన్‌ తాడురి శ్రీనివాస్‌ ఉన్నారు. వీరితో పాటు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌,డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి,ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌,కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ తుల ఉమ, ముఖ్యకార్యదర్శి సురేష్‌, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి బూపాల్‌ రెడ్డి, తెలంగాణ కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం తదితరులు వున్నారు.

Hostel for Golla Kurumas

ముఖ్యమంత్రిని కలిసిన వివిధ రాష్ట్రాల కురుమ ప్రతినిధులు తొలుత రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాల పట్ల ముఖ్యంగా బీసీలకు,గొల్ల-కురుమలకు చేపట్టిన పథకాల పట్ల సంతోషం వెలిబుచ్చారు. తమ కమ్యూనిటీకి రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా మద్దతు ఇస్తున్నట్లు, ఇది చాలా గొప్ప విషయంగా తాము భావిస్తున్నట్లు వారన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సదస్సుకు తాము దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చామని, అందులో మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర రకాల ప్రజాప్రతినిధులు కూడా వున్నారని వారన్నారు. ఈ సందర్భంగా సీఎం వారికి రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టనున్న, అమలుపరుస్తున్న పథకాల గురించి వివరించారు. ప్రజలకు సరిగ్గా పనిచేస్తే అంతా మేలు జరుగుతుందనీ, కేవలం మాటలతో కాలం వెల్లబుచ్చడం సరైందికాదని, తాను ప్రజా జీవితంలో 40 సంవత్సరాలకు పైగా ఉన్నానని, తెలంగాణా కోసం పోరాడానని, అందకే ప్రజలకు ఏం చేయాలనే విషయంలో స్పష్టత ఉందని ఆయన అన్నారు.

తెలంగాణా కోసం పోరాడుతున్నా రోజుల్లో తాను గంటల తరబడి దేశంలో అన్ని పార్టీల నాయకులకు పోరాట అవశ్యకతను గురించి వివరించేవాడినని, 14 సంవత్సరాల సదీర్ఘ పోరాట ఫలితంగా సాధించిన తెలంగాణ రాష్ట్రంలో తాము అధికారంలో వచ్చన తరువాత ప్రజలకోసం ఏం చేస్తే మంచిదో బాగా ఆలోచించామని సీఎం చేప్పారు. తెలంగాణ గురించి అర్థం చేసుకోవడానికి చాలా అధ్యయనం చేశామని, అధికారంలో వచ్చిన తారువాత కూడా ఆ అధ్యయనం కొనసాగిందని సీఎం వారితో అన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేసినట్లయితే విచారించాల్సిన అవసరం లేదని, కాని, అలా జరగలేదని అయన అన్నారు. ప్రకృతి మనకిచ్చిన అపార సంపదతో మన దేశంలో,రాష్ట్రంలో ఉత్పత్తి చేయలేనిదేది లేదని, అలాంటప్పుడు ఆ అవకాశం సద్వినియోగం చేసుకోవడం మంచిదని ఆయన చెప్పారు.

Hostel for Golla Kurumas

గొర్రెల పంపిణీ పథకం గురించి వివరిస్తూ… సీఎం.. యాదవ కమ్యూనిటీ దేశంలో కోట్లలో వుందని,అయినా మాంసం దిగుమతి చేసుకుంటున్నామని అయన అన్నారు. తెలంగాణలో 35-40 లక్షల మంది గొల్ల-కురుమలున్నారని, వారి వృత్తి ప్రధానంగా గొర్రెల పెంపకమని అయినా సుమారు 650 లారీల మాంసం రాష్ట్రం దిగుమతి చేసుకుంటున్నదని, ఒక్క హైదరాబాద్‌ నగరానికే వేరే రాష్ట్రాల నుండి సుమారు 350 లారీల గొర్రెలను ప్రతిరోజు దిగుమతి చేసుకుంటున్నామని, ఇది సిగ్గుపడాల్సిన విషయమని ముఖ్యమంత్రి అన్నారు. ఇది పోవాలంటే ఏం చెయ్యాలనే విషయంలో తామంతా సుదీర్ఘంగా చర్చించిన తరువాత 4500 కోట్ల ప్రణాళిక రూపొందిచామని ముఖ్యమంత్రి వారికి చెప్పారు.

ఆ పథకం ప్రకారం రెండేళ్ళ వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 84 లక్షల గొర్రెలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెటుకున్నామని ఆయన చెప్పారు. అందులో భాగంగా ఇప్పటికే 23.80 లక్షల గొర్రెలను పంపిణీ చేశామని చెప్పారు. తమ గొర్రె కాపరుల కమ్యూనిటీనే తమ అసలు సిసలైన మానవ వనరులని, అందుకే వాటి అభివృద్ధికి కంకణం కట్టుకున్నామని ముఖ్యకమంత్రి చెప్పారు. రెండేళ్ళ తరువాత హైదరాబాద్‌ నగరంలో అఖిల భారత షఫర్డ్‌ కమ్యూనిటీ సభలు జరుపుతామని, అప్పటీకి ప్రపంచలోనే అతి ధనవంతమైన కమ్యూనిటీగా తెలంగాణ షఫర్డ్‌ కమ్యూనిటీ రూపుదిద్దుకుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.

Hostel for Golla Kurumas

గతంలో వ్యవసాయాన్ని ఎవరూ సరిగ్గా అర్ధం చేసుకోలేదని, పట్టించుకోలేదని, అందుకే ఆత్మహత్యలు జరిగేవని అన్న సీఎం, మొట్ట మొదటి సారిగా తెలంగాణ రైతులను సంఘటిత పరిచే చర్యలకు శ్రీకారం చుట్టామని, అందులో భాగంగా రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసామని చెప్పారు. ఎకరానికి రూ.8000 పెట్టుబడి కూడా వచ్చే ఏడాది నుంచి ఇస్తామని ఆయన అన్నారు. షఫర్డ్‌ కమ్యూనిటీ బాగుపడి,రైతు సాగుబడి, పాల విక్రయాదారులు బాగుపడి, ఇలా ఒక్కొక్కరూ బాగుపడితే రాష్ట్రం కూడా బాగుపడి ఆర్ధికంగా బలపడుతుందని సీఎం అన్నారు.

గొల్ల-కురుమల సంఘం వసతి గృహానికి పదెకరాల స్థలం పది కోట్ల రూపాయలు సహాయం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే ప్రత్యేక్ష ఎన్నికల్లో పోటీచేసి గెలిచే అవకాశం లేని వెనుకబడిన తరగతుల వారికి శాసన మండలిలో ప్రాతినిధ్యం కలిగించే ఆలోచన వుందని సీఎం చెప్పారు. సీఎం కలవడానికి వచ్చిన ప్రతినిధులందరితో కలసి ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేశారు.

- Advertisement -