ఉలవలతో ఆరోగ్య ప్రయోజనాలు!

101
- Advertisement -

ఉలవల గురించి మనందరికి తెలిసిందే నవదన్యాలలో ఉలవలు కూడా ఒక భాగం. వీటిని వంటకాల్లో అత్యంత ప్రియంగా వినియోగిస్తూ ఉంటారు. ఉలవలతో చేసే చారు, గుగ్గిళ్ళు ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఉలవచారు బిరియాని వీటితో తయారు చేసిందే. అయితే ఉలవలను మంచి పౌష్టికాహారంగా పశువులకు దానగా కూడా ఊయపయోగిస్తుంటారు. ఉలవలలో ఉండే ఎన్నో పోషకాలు శరీరాన్ని దృఢంగా ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడతాయి.ఉలవలలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి..

ప్రతి 100-200 గ్రాముల ఉలవలలో 20 నుంచి 30 గ్రాముల ప్రోటీన్, 50 గ్రాముల కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. అందుకే ఎదిగే పిల్లలకు ఉలవలతో కూడిన ఆహారాన్ని తినడం అలవాటు చేయడం వల్ల పిల్లల శరీరం పుష్టిగా తయారవుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇక వీటిలో కాల్షియం, ఫాస్ఫరస్, జింక్, ఐరన్ వంటి సూక్ష్మ పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు కూడా అధికంగా ఉంటాయి. అందువల్ల చాలమంది ఎదుర్కొనే సాధారణ ఆహార సమస్యలను
ఉలవలు దూరం చేస్తాయి.

వీటిలో ఉండే ఫైబర్ కారణంగా ఆకలి పెరుగుతుంది. అంతే కాకుండా మలబద్దకం, గ్యాస్టిక్ సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇంకా రక్తంలోని చక్కెర స్థాయిని నియమ్తృంచడంలో కూడా ఉలవలు కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల డయబెటిస్ తో భాదపడే వాళ్ళు ఉలవలను ఫుడ్ డైట్ లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇక ఊబకాయంతో బాధపడేవారికి కూడా ఉలవలు చక్కటి పరిష్కారం. ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన ఉలవలను తినడం ద్వారా వేగంగా బరువు తగ్గి ఊబకాయం
దూరమౌతుంది. ఇంకా గుండె సమస్యలను దూరం చేయడం కిడ్నీలో రాళ్ళు, మూత్రంలో మంట, ఆడవాళ్ళలో వచ్చే నెలసరి సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో ఉలవలు ఎంతగానో దోహదపడతాయి. అందుకే ఉలవలను మన డైలీ ఆహార డైట్ గా చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read: త్వరలో విశాఖ టూ సింగపూర్‌కి క్రూయిజ్ సేవలు

- Advertisement -