హారర్ థ్రిల్లర్… ‘పిజ్జా3’

56
- Advertisement -

మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘పిజ్జా’. ఈ ఫ్రాంచైజీ లో వచ్చిన రెండు చిత్రాలు తెలుగు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకొని, భారీ విజయాలు సాధించి, ప్రత్యేక ఫ్యాన్ భేస్ ని సంపాదించుకున్నాయి. ఇప్పుడు ‘పిజ్జా3’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటివలే తమిళంలో విడుదలైన ‘పిజ్జా3’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అశ్విన్ కాకుమణి, పవిత్ర మరిముత్తు ప్రధాన పాత్రలలో మోహన్ గోవింద్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పిజ్జా3’ తమిళనాట అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ఘన విజయం సాధించింది. ఈ చిత్రం తెలుగు రైట్స్ ని సొంతం చేసుకున్న కనెక్ట్ మూవీస్ ఎల్ఎల్పీ త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

తాజాగా మేకర్స్ ట్రైలర్ ని విడుదల చేశారు. ‘’అనగనగా ఒక ఊర్లో ఓ రాజు ఉండేవాడు. ఆ రాజు వేటకి వెళ్ళినప్పుడు జింక అని పొరబడి ఒక మనిషిని వేటాడుతాడు. చనిపోయిన ఆ మనిషి తల్లితండ్రులు పుత్ర శోకంతో ఆ రాజుని శపించారు. అప్పటి నుంచి ఆ రాజు అనుభవించిన వేదనే అతి పెద్ద ఇతిహాసంగా మారింది’’ అనే వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం సీట్ ఎడ్జ్ హారర్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చింది.

Also Read:మంత్రి కేటీఆర్ ప్రసంగానికి అద్భుత స్పందన..

కథ, కథనం చాలా ఎక్సయిటింగా వున్నాయి. విజువల్స్ హారర్ ని ఎలివేట్ చేస్తూ టెర్రిఫిక్ గా అనిపించాయి. అశ్విన్ కాకుమణి, పవిత్ర మరిముత్తు ల నటన మరో ఆకర్షణగా నిలిచింది. కెమరాపని తనం, నేపధ్య సంగీతం బ్రిలియంట్ గా వున్నాయి. దర్శకుడు మోహన్ గోవింద టేకింగ్ ఎక్స్ టార్దినరిగా వుంది. ‘పిజ్జా3’ అవుట్ స్టాండింగ్ హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని భరోసా ఇచ్చింది ట్రైలర్.తారాగణం: అశ్విన్ కాకుమణి, పవిత్ర మరిముత్తు , గౌరవ్ నారాయణన్ , కాళీ వెంకట్, అనుపమ కుమార్, సురుతి పెరియసామి, రవీనా దాహా ABI నక్షత్ర, కవితా భారతి.

Also Read:విశాఖ నుంచి జగన్ పాలన కష్టమేనా?

- Advertisement -