విజ‌య నిర్మ‌ల మృతి ప‌ట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన సీఎం కేసీఆర్, తలసాని

257
Cm Kcr Talasani Viajnirmala
- Advertisement -

అలనాటి నటి, దర్శకురాలు విజయనిర్మల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన సీఎం కేసీఆర్, సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి తల‌సాని శ్రీనివాస్ యాదవ్. విజయనిర్మల మృతి పట్ల ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆమె మ‌ర‌ణం సినీ ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటు అని ఆయ‌న అన్నారు. న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా, నిర్మాత‌గా ఎన్నో అద్భుత‌మైన చిత్రాలు విజ‌య నిర్మ‌ల చేశారని ప‌లువురు ప్ర‌ముఖులు గుర్తు చేసుకున్నారు.

గత కొద్ది రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుండగా నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమె పార్థివదేహాన్ని ఉదయం 11 గంటలకు నానక్‌రామ్‌గూడలోని ఆమె స్వగృహానికి తీసుకొస్తారు. అభిమానుల సందర్శనార్థం నేడు అక్కడే ఉంచి రేపు ఉదయం ఫిలించాంబర్‌కు తరలిస్తారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తారు.

1946 ఫిబ్రవరి 20న జన్మించిన విజయనిర్మల..అత్యధిక చిత్రాల్లో క‌ృష్ణ పక్కనే హీరోయిన్‌గా నటించారు. వీరిద్దరూ కలిసి 50 సినిమాల్లో జంటగా నటించారు.ప్రపంచంలోనే ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా..ఆమె గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. రఘుపతి వెంకయ్య అవార్డును కూడా అందుకున్నారు.11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో నటిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన విజయ నిర్మల..రంగుల రాట్నం చిత్రంతో హీరోయిన్ పరిచయం అయ్యారు.

- Advertisement -