దక్షిణాది సినీ దిగ్గజాలు, సూపర్‌స్టార్ రజనీకాంత్ మరియు నటసింహం నందమూరి బాలకృష్ణలకు అరుదైన గౌరవం దక్కనుంది. 50 ఏళ్లపాటు సినీ పరిశ్రమకు వారు చేసిన విశేష సేవలను, వారి సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సత్కారాన్ని ప్రకటించింది.
గోవాలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుకల్లో ఈ ఇద్దరు మహానటులను ఘనంగా సన్మానించనున్నారు. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ అధికారికంగా ఈ ప్రకటన చేశారు.
తమ నటనా పటిమతో, అద్భుతమైన పాత్రలతో దశాబ్దాలుగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రజనీకాంత్, బాలకృష్ణలు సినీ పరిశ్రమకు చేసిన కృషికి ఈ సత్కారం ఒక గొప్ప నిదర్శనం. భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేసిన ఈ ఇద్దరు దిగ్గజాలను IFFI వేదికపై సన్మానించడం తెలుగు, తమిళ సినీ అభిమానులకు గర్వకారణం.
Also Read:కొంపల్లి ఫ్లైఓవర్ పనుల ఆలస్యంపై ఈటల సీరియస్..

