‘జానీ మాస్టర్‌’కు ఘన సన్మానం

3
- Advertisement -

ఇటీవల ప్రకటించిన జాతీయ పురస్కారాల్లో తిరుచిత్రాంబలం సినిమాలోని మేఘం కరుగత పాటకు అవార్డ్ గెల్చుకున్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.  చిత్ర పరిశ్రమ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ లో ఘనంగా సన్మాన కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో డ్యాన్సర్స్ అసోసియేషన్ నాయకులు, తెలుగు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, ఫిలింఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, నిర్మాతలు ప్రసన్నకుమార్, దామోదర ప్రసాద్, శేఖర్ మాస్టర్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో

ఫిలింఫెడరేషన్ నాయకులు సురేష్ మాట్లాడుతూ – డ్యాన్స్, ఫైట్స్ క్రాఫ్ట్ ల్లో మనం ఇతర చిత్ర పరిశ్రమల నుంచి అవమానాలు ఎదుర్కొన్నాం. ఈ అవమానాలను ఎదుర్కొని నిలబడి ఈ రోజు జాతీయ అవార్డ్ అందుకునే స్థాయికి ఎదిగాం. మనకు జాతీయ అవార్డ్ తీసుకొచ్చిన జానీ మాస్టర్ గారికి శుభాకాంక్షలు చెబుతున్నాం. జానీ మాస్టర్ సాధించిన జాతీయ అవార్డ్ తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణం. ఆయన ఇచ్చిన స్పూర్తితో మన డ్యాన్సర్స్, ఇతర క్రాప్ట్ లు మరింత ఉత్సాహంగా ముందుకెళ్తాయని కోరుకుంటున్నా. అన్నారు.

ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని మాట్లాడుతూ – బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జాతీయ అవార్డ్ గెల్చుకున్న జానీ మాస్టర్ గారికి కంగ్రాట్స్. ఆయన ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. జానీ మాస్టర్ గెల్చుకున్న నేషనల్ అవార్డ్ ఇతర డ్యాన్సర్స్ కు ఇన్సిపిరేషన్ కావాలి. ఈ కార్యక్రమంలో ఇటీవల ఫిలింఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికైన భరత్ భూషణ్ గారు ఉన్నారు. ఆయన మన సినీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో గతంలో ఎలాగైతే చొరవ చూపించారో ఇకపై కూడా అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.

నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ – మనం గురించి ఎవరేం అనుకున్నా మనం సాధించే విజయాలే జవాబు చెబుతాయి. మీ ఆసోసియేషన్ లోని సమస్యలు మీరే పరిష్కారం చేసుకోవాలి. బయటకు రాకుండా చూసుకోవాలి. జానీ మాస్టర్ కు తమిళ సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చింది. కాబట్టి కళాకారులకు భాషతో సంబంధం లేదు. జానీ మాస్టర్ గారికి కంగ్రాట్స్ చెబుతున్నాం. తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడే మరిన్ని విజయాలు ఆయన సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ – నేను, గణేష్, జానీ దాదాపు ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశాం. ఈరోజు జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డ్ రావడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. మా అందరికీ ఆ అవార్డ్ వచ్చినట్లు ఆనందిస్తున్నాం. గతంలో నార్త్ కు కొరియోగ్రఫీలో నేషనల్ అవార్డ్స్ వచ్చేవి. ఇప్పుడు మనకు రావడం మొదలైంది. జానీ విజయానికి మేమంతా గర్విస్తున్నాం. అన్నారు.

Also Read:‘అరి’ …’చిన్నారి కిట్టయ్య’ లిరికల్ సాంగ్

- Advertisement -