సంతోష్ కుమార్‌కు విశిష్ట పురస్కారం..

8
- Advertisement -

ఆకుపచ్చని హరితవ్యాప్తికి పిల్లలే ధూతలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్, రాజ్యసభ మాజీ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ స్పష్టం చేశారు. విత్తనం నుంచి మొక్క..మొక్క నుంచి మహావృక్షం ఎలా ఎదుగుతుందో అలాగే పర్యావరణ బ్రాండ్ అంబాసిడర్లుగా పిల్లలు ఎదుగుతూ తమ పరిసరాలను హరితమయం చేస్తారని, అందుకు పెద్దలుగా మనం వారికి సహకరించాలని ఆయన ఉద్బోధించారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లో శనివారం జరిగిన శ్రీకల్పతరు సంస్థాన్లో గ్రీన్ ఐడల్ అవార్డు కార్యక్రమంలో ఆయన విశిష్ట అతిథిగా హాజరయ్యారు. తన పదవీకాలంలో దేశంలోనే అత్యధిక మొక్కలు నాటి , నాటేందుకు ప్రేరణగా నిలిచినందుకు శ్రీ కల్పతరు సంస్థాన్ రాజ్యసభ మాజీ సభ్యులు సంతోష్ కుమార్ కు విశిష్ట పురస్కారం అందించింది .

రాజస్థాన్ గవర్నర్ హరి బావ్ బాగ్డే అవార్డును అందజేశారు .కార్యక్రమంలో సంతోష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం తాను చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు స్ఫూర్తి అని వివరించారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు మొక్కల పెంపకం, హరితవ్యాప్తికి కేసీఆర్ చేపట్టిన తెలంగాణకు హరితహారం దోహదం చేసిందని, ఫలితంగా రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెరిగిందన్నారు . , ఈ క్రమంలో పర్యావరణ ప్రాముఖ్యతపై విద్యార్థులు, చిన్నారుల్లో ఆసక్తి పెంచేందుకు వారి కరిక్యులము లో పర్యావరణ అంశాలు ఉండటంతోపాటు వారికి క్షేత్రస్థాయి కార్యక్రమాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యావరణ హితానికి అనువైన కార్యాచరణ పిల్లల నిత్య జీవితంలో భాగం చేయాలని ఆయన ఉద్బోదించారు.

కాగా, రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ జాతీయ స్థాయిలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహించి, హరితవ్యాప్తికి కృషి చేసిన జోగినపల్లి సంతోష్ కుమార్ కు రాజస్థాన్ రాష్ట్ర గవర్నర్ హరి భావ్ భాగడే అభినందించి, అవార్డు ప్రదానం చేశారు. అనంతరం రాజస్థాన్ గవర్నర్ గ్రీన్ బాచుపన్ ఛాంపీయన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.కార్యక్రమంలో మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుధీర్ ముంగటివారు , ట్రీ మాన్ అఫ్ ఇండియా విష్ణు లంబా తదితరులు పాల్గొన్నారు . కార్యక్రమములో పర్యావరణం కోసం పనిచేస్తున్న పలు సంస్థలు , పర్యావరణ వేత్తలను సన్మానించారు.

- Advertisement -