హనీమూన్ ఎక్స్ ప్రెస్..ప్రీ రిలీజ్

11
- Advertisement -

చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న సినిమా “హనీమూన్ ఎక్స్ ప్రెస్”. ఈ చిత్రాన్ని న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ప్రయోగాత్మకంగా ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీ గా దర్శకుడు బాల రాజశేఖరుని రూపొందించారు. హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా ఈ నెల 21న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నటుడు కేఎల్ ప్రసాద్ మాట్లాడుతూ – హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా కంటెంట్ చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. ఈతరం ప్రేక్షకులు బాగా ఇష్టపడే సినిమాలా ఉండబోతోంది. హీరో హీరోయిన్స్ చైతన్య రావ్, హెబ్బా పటేల్ కు, డైరెక్టర్ బాల కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

గాయకుడు దీపు మాట్లాడుతూ – హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమాలో పాట పాడే అవకాశం ఇచ్చిన సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్ గారికి థాంక్స్. ఈ సినిమాలో సాంగ్స్ చాలా బాగుంటాయి. నేను ఈ మూవీలో పార్ట్ అయినందుకు సంతోషంగా ఉంది. అన్నారు.

సింగర్ స్ఫూర్తి జితేందర్ మాట్లాడుతూ – హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమాలో తెలుగు, స్పానిష్ సాహిత్యం కలిపి ఒక కొత్త తరహా పాటను నేను పాడాను. ఈ పాట తెలుగు శ్రోతలకు కొత్త అనుభూతిని ఇస్తుంది. దర్శకుడు బాల గారు మా నాన్న ఫ్రెండ్స్. నేను స్పానిష్ సాంగ్స్ రాయడం బాల గారికి తెలుసు. అలా నాకు ఈ మూవీలో అవకాశం ఇచ్చారు. హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమాలో సినిమా మా టీమ్ అందరికీ బిగ్ సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శకుడు దశరథ్ మాట్లాడుతూ – దర్శకుడు బాల రాజశేఖరునితో నాకు మంచి మిత్రుడు. ఆయన హాలీవుడ్ లో బ్లైండ్ యాంబిషన్, గ్రీన్ కార్డ్ ఫీవర్ అనే మూవీస్ చేశాడు. ఇప్పుడు టాలీవుడ్ కు వచ్చి హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా రూపొందించారు. హీరో చైతన్య రావ్ నాకు మంచి ఫ్రెండ్. ఈ మూవీకి కల్యాణి మాలిక్ మంచి సాంగ్స్ ఇచ్చారు. ఈ నెల 21న థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమాను మీరంతా ఆదరించాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.

Also Read:రాష్ట్రంలో ‘మహిళా శక్తి – క్యాంటీన్ సర్వీస్’ లు

- Advertisement -