పిల్లల ఆరోగ్యానికి తేనె మంచిదేనా?

26
- Advertisement -

తేనెను పంచామృతాలలో ఒకటిగా చెబుతుంటారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు అన్నీ ఇన్ని కావు. ఆయుర్వేదంలో తేనెను దివ్యాఔశదంగా పరిగణిస్తుంటారు నిపుణులు. తేనెను వయసు సంబంధం లేకుండా ఎవరైనా తీసుకోవచ్చు, తేనెను తీసుకునే విధానాన్ని బట్టి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతుంటాయి. ప్రతిరోజూ గోరువెచ్చని నీటితో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటే రక్తంలో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. ఇంకా ఎర్ర రక్తకణాల సంఖ్యను పెంచుతుంది. ఇంకా తేనె తీసుకోవడంవల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన సూక్ష్మజీవులను నియంత్రిస్తాయి. ఇంకా ప్రతిరోజూ తినే తినడం వల్ల జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది. .

అయితే తేనెను పిల్లలు తినకూడదని కొందరిలో అపోహ ఉంది. ఎందుకంటే పిల్లల్లో తేనె ప్రతికూల ప్రభావం చూపుతుందని వారి ఆరోగ్యానికి తేనె అంతా మంచిది కాదని కొందరు నమ్ముతుంటారు. కానీ తేనెలోని ఔషధ గుణాలు పిల్లలకు ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు ప్రతిరోజూ ఒక టి స్పూన్ తేనె తినిపించడం వల్ల వారిలో కనిపించే దగ్గు, జలుబు, వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇంకా తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరీయల్, యాంటి ఫంగల్ గుణాలు పిల్లల్లో జీర్ణ శక్తిని మెరుగు పరచి మలబద్దకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. తద్వారా పిల్లలు ఆహారం తినడానికి ఆసక్తి చూపుతారు. ఇంకా పిల్లల్లో గుండె సంబాధిత సమస్య్లను దూరం చేయడంలో కూడా తేనె చాలా బాగా ఉపయోగ పడుతుంది. ఇంకా పిల్లాలో చురుకుదనాన్ని పెంచడంలోనూ, వారికి జ్ఞాపక శక్తిని మెరుగు పరచడంలోనూ ఎంతగానో ఉపయోగపడుతుందట. అందుకే పిల్లలకు ప్రతిరోజూ ఒక టేబుల్ స్పూన్ స్వచ్చమైన తేనె తినిపించాలని నిపుణులు చెబుతున్నారు.

Also  Read:Gold Rate:బంగారం లేటెస్ట్ ధరలివే

- Advertisement -