ప్రజలతో పోలీసులు ఫ్రెండ్లీగా ఉన్నారు.. హోంమంత్రి

310
Home Minister Mahmood Ali
- Advertisement -

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో నూతన పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించారు హోంమంత్రి మహమూద్ అలీ. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపాల్ రెడీ, హోంమంత్రి మహముద్ అలీ తోపాటు పలువురు నాయకులు,పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. 700 కోట్ల రూపాయలతో నూతన వాహనాలు ఇచ్చాము. పోలీసుల శాఖ అన్ని రకాల సదుపాయాలు కల్పించి ఆధునికీకరణ చేశాము. గత ప్రభుత్వంలో పొలీస్ పొలిటికల్ నేతల కనుసన్నల్లోనే ఉండేది. కానీ ప్రస్తుతం ప్రభుత్వ ఫ్రెండ్లీ పోలీస్‌ విధానాన్ని తీసుకొచ్చింది. ప్రజలతో పోలీసులు ఫ్రెండ్లీగా ఉంటున్నారు.

ఇండియాలోనే తెలంగాణ పోలీసులు బాగా పనిచేస్తున్నారని మంచి పేరు ఉంది. సామాన్య ప్రజలు భయం లేకుండా పోలీస్టేషన్‌కి రవచ్చు. 17 పర్సెంట్ గ్రోత్ ఉంది. అలాగే పోలీస్‌ పనితీరులో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. అని హోంమంత్రి అన్నారు.

- Advertisement -