తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నక్సలిజం పూర్తిగా కనుమరుగైపోయిందన్నారు హోం మంత్రి మహమ్ముద్ అలీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలిజం పెరుగుతుందని సీమాంధ్ర నాయకులు హెచ్చరించారని..కానీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో నక్సలిజం పూర్తిగా నశించిపోయిందన్నారు. 10రాష్ట్రాల హోంశాఖ మంత్రులతో ఇవాళ ఢిల్లీలో కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ హోం మంత్రి మహమ్ముద్ అలీ హాజరయ్యారు.
ఈసందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. ఈసమావేశంలో శాంతి భద్రతలు, నక్సలిజంపై ప్రధానంగా చర్చ జరుగనున్నట్లు తెలిపారు. నక్సలైట్లు ఎక్కువగా రైతు కుటుంబాల వారే ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం రైతు బంధు, రైతు భీమా పథకాలు ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 24గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. తెలంగానలో నక్సలిజాన్ని ఎలా నిర్మూలించామో ఈసమావేశంలో వివరిస్తామని తెలిపారు. తెలంగాణ పోలీసులు చాలా బాగా పనిచేస్తున్నట్లు తెలిపారు.