దేశంలో ఏరాష్ట్రం లో రవాణా వ్యవస్థను విలీనం చేయలేదు

429
home minister
- Advertisement -

దేశంలోని ఏ రాష్ట్రంలో రవాణా వ్యవస్ధను ప్రభుత్వంలో విలీనం చేయలేదన్నారు హోం మంత్రి మహమ్ముద్ అలీ. ఆర్టీసీ సమ్మె పై నేడు తెలంగాణ భవన్ లో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల ను ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేయలేమని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న రవాణ వ్యవస్థ ప్రజల సేవ కు అంకితం అయ్యారు కానీ ప్రభుత్వం లో విలీనం కాలేదు.

ఆర్టీసీ కి 3000కోట్ల రూపాయలు సీఎం కేసీఆర్ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించ లేము. సమ్మెను తీవ్రం గా ఖండిస్తున్నాము. సీఎం కేసీఆర్ ఎంతగా బతిమాలినా సమ్మెను నివారించలేకపోయారు. పండుగ సమయంలో సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు.. అయినా సరే ప్రయివేటు కండక్టర్ లు డ్రైవర్ ల చే బస్సులను నడిపిస్తున్నామని తెలిపారు.

- Advertisement -