అమిత్‌ షాను చంపేస్తామంటూ లేఖ..

302
Amit Shah
- Advertisement -

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా,మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే లీనా జైన్‌పై బాంబు దాడి చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరికలు జారీ చేశారు.. దీనికి సంబంధించి ఎమ్మెల్యే లీనా జైన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గంజ్‌ బసోడా ఎమ్మెల్యే లీనా జైన్‌ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో పాటు తనను చంపేస్తామని తన పీఎ ఆఫీసుకు బెదిరింపు లేఖ వచ్చిందని తెలిపారు.

MLA  Leena and HM Amit Shah

గంజ్‌ బసోడా రైల్వేస్టేషన్‌, రాజీవ్‌ గాంధీ ఆస్పత్రి, పోలీసు స్టేషన్‌ను పేల్చివేస్తామని లేఖలో పేర్కొన్నారని ఆమె వెల్లడించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో గంజ్‌ బసోడాలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. లేఖ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -