హోలీ సెలబ్రేషన్స్‌పై నిషేధం!

245
holi
- Advertisement -

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోండగా పలు రాష్ట్రాలు కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాయి. రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతుండటం అందరిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో విద్యాసంస్థలను మూసివేశాయి.

ఇక ఈ వారంలో హోలీ పండుగ ఉండటంతో చాలా రాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే రాజస్థాన్, కర్నాటక, హరియాణా స్టేట్స్‌‌ హోలీ సెలబ్రేషన్స్‌పై నిషేధం విధించగా ఢిల్లీ ప్రభుత్వం, ముంబై, పూణె కార్పొరేషన్‌‌లు కూడా సెలబ్రేషన్స్‌పై నిషేధం విధించాయి. మరికొన్ని రాష్ట్రాలు సెలబ్రేషన్స్‌‌ను బ్యాన్ చేసే దిశగా నిర్ణయం తీసుకునేందుకు యోచిస్తున్నాయి.

ఇక దేశంలో గత 24 గంట‌ల్లో ఇండియాలో కొత్త‌గా 59,118 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 1,18,46,652కి చేరింది. 24 గంట‌ల్లో ఇండియాలో 257 మంది క‌రోనాతో మృతి చెందారు.

- Advertisement -