హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాబ్ రైనర్ (78), ఆయన సతీమణి మిచెల్ (68)కు సంబంధించిన అనుమానాస్పద మృతి వార్తలు లాస్ ఏంజిల్స్‌లో కలకలం రేపుతున్నాయి. లాస్ ఏంజిల్స్‌లోని వారి నివాసంలో ఇద్దరూ విగతజీవులుగా కనిపించారంటూ సోషల్ మీడియా మరియు కొన్ని అంతర్జాతీయ వేదికల్లో కథనాలు వెలువడ్డాయి. అయితే ఇప్పటివరకు దీనిపై అధికారికంగా పూర్తి స్థాయి నిర్ధారణ లేదు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, వారి ఇంట్లో స్పందన లేకపోవడంతో స్థానిక అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించినట్లు ప్రచారం జరుగుతోంది. ఘటనపై లాస్ ఏంజిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని, మృతికి కారణాలు ఏమిటన్న దానిపై ఫోరెన్సిక్ పరీక్షలు జరుగుతున్నాయని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే పోలీసు శాఖ నుంచి స్పష్టమైన ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.
రాబ్ రైనర్ హాలీవుడ్లో పేరెన్నికగన్న దర్శకుడు. A Few Good Men, When Harry Met Sally, The American President వంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన సతీమణి మిచెల్ కూడా సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారని అభిమానులు గుర్తు చేస్తున్నారు.ఈ వార్తలపై అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read:నిర్మాణ రంగంలోకి వెంకీ కుడుముల

