హోలీ…మందుబాబులకు షాక్!

59
holi
- Advertisement -

హోలీ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు ఏర్పాటుచేశారు. ముందుజాగ్రత్ల చర్యల్లో భాగంగా జంటనగరాల పరిధిలో 48 గంటల పాటు మద్యం దుకాణాలు బంద్ అని తెలిపారు.

బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలపై నిషేధం విధించిన పోలీసులు…. సంబంధం లేని వ్యక్తులపై రంగులు వేయొద్దని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే.. కఠిన చర్యలుంటాయని హెచ్చరికలు జారీ చేశారు

హోలీ వేడుకల్లో పాల్గొనే వారు.. ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని, గుంపులు గుంపులు తిరుగుతూ న్యూసెన్స్ చేయవద్దని సూచించారు. గురువారం సాయంత్రం 06 గంటల నుంచి శనివారం ఉదయం 06 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -