ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మాజీ క్రికెటర్‌..

245
- Advertisement -

బ్రాడ్ హాగ్…ఆస్ట్రేలియా మాజీ స్టార్ క్రికెటర్‌..ఒంటిచేత్తో ఆసీస్‌ను ఎన్నో మ్యాచ్‌ల్లో గెలిపించి సత్తా చాటాడు. అంతేగాదు ఐపీఎల్లో సైతం సత్తాచాటి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన హాగ్‌…ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట. తన తాజా పుస్తకం ‘ద రాంగ్ యూఎన్’ లో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఆత్మహత్య చేసుకోవడానికి దాదాపు రెడీ అయిపోయానని చెప్పాడు. తన వైవాహిక జీవితంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురవడమే దీనికి కారణమని తెలిపాడు.

‘ఆత్మహత్య చేసుకోవడానికి ప్రణాళిలకు సిద్ధం చేసుకున్నా. దానిలో భాగంగా కారును ఫ్రెమెంటల్స్ పోర్ట్ బీచ్ వద్ద పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్లా. అలా సముద్రాన్ని, అందులోని నీటిని చూస్తూ కూర్చున్నా. అయితే నాకు ఈత రావడంతో నీటిలో పడి ఆత్మహత్య చేసుకోవడం సరైనది కాదనుకున్నా. అతి కష్టంమీద ఆ ఆలోచనను విరమించుకుని వచ్చేశా. మరోసారి చీకటి ప్రదేశంలోకి వెళ్లి ప్రశాంతంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. అయితే ఆ సమయంలో ఇంకా ఏదో సాధించాలనే తపన నాలో ఎక్కువైంది. ఆలోచించడం వేరు, చేయడం వేరు అనే విషయం అప్పుడే నాకు బోధ పడింది. ఇక ఆత్మహత్య అనే విషయాన్నిపక్కను పెట్టి నా అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యా’ అని మాజీ స్పిన్నర్ హాగ్ తెలిపాడు.

brad hogg

గతేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో కోల్ కతా నైట్ రైడర్స్ తరుపున ఆడిన హాగ్.. ఈ లీగ్ లో అత్యధిక వయసు కల్గిన వెటరన్ ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. బిగ్ బాష్ లీగ్ లో మెల్ బోర్న్ రెనెగేడ్స్ కు ఆడుతున్నాడు. రైనా సారథ్యంలోని గుజరాత్‌ జట్టుకు బ్రాడ్‌ హగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

brad-hogg

- Advertisement -