హైదరాబాద్‌ మెట్రో…సరికొత్త రికార్డు

413
hmr
- Advertisement -

హైదరాబాద్ మెట్రోకు గ్రేటర్ వాసుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య పెరిగిపోతూ వస్తుంది. ఓ వైపు ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు పెద్ద ఎత్తున మెట్రోలో ప్రయాణించేందుకు ఆసక్తిచూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు సోమవారం ఒక్కరోజే 4 లక్షల మందికి పైగా ప్రయాణించారు.

మెట్రో ప్రారంభమైన నాటి నుంచి ఇదే అత్యధికమని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అదనపు సర్వీసులను నడుపుతున్నామని చెప్పారు. ప్రతి 3.5 నిమిషాలకు ఒక మెట్రో రైలు నడుస్తుందని…. సోమవారం ఒక్క రోజే 830 ట్రిప్పులు నడిపామని చెప్పారు.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో భాగ్యనగరంలో ప్రజలు మెట్రో రైలును సరైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. మొత్తంగా రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తోంది హైదరాబాద్ మెట్రో రైలు.

- Advertisement -