కరోనా తర్వాత మరో వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను వణికిస్తోంది. HMPV కేసు చైనాను అతలాకుతలం చేస్తుండగా తాజాగా భారత్‌లో బెంగళూరులో తొలి కేసు నమోదైంది. హెచ్‌ఎంపీవీ వైరస్ సోకితే సాధారణంగా దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియా వంటి సమస్యలకు సైతం దారి తీయొచ్చు.
దగ్గు, తుమ్ముల నుంచి వచ్చే తుప్పిర్లు ద్వారా వైరస్ వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వారికి షేక్‌హ్యాండ్ ఇచ్చినా, తాకినా వైరస్ సోకవచ్చు.వైరస్‌తో కలుషితమైన వస్తువులను తాకి, అవే చేతులతో ముక్కు, మూతి, కళ్లను తాకినా వైరస్ సోకుతుంది. పిల్లలు, వయోధికులు, రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వారికి హెచ్‌ఎంపీవీ ముప్పు అధికం.
తరచూ సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు చేతులను శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకోని చేతులతో ముఖాన్ని ముట్టుకోవద్దు. అనారోగ్య లక్షణాలతో ఉన్న వారికి కొంచెం దూరంగా మసులుకోవాలి. తరచూ ముట్టుకునే వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. హెచ్‌ఎంపీవీ నివారణకు వ్యాక్సిన్ లేదు. వ్యాధి లక్షణాలను తగ్గించేందుకు, మరిన్ని సమస్యలు తలెత్తకుండా నివారణగా మాత్రమే వైద్య చికిత్సను అందిస్తున్నారు.
Also Read:KTR: ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్