చైనాలో మరో వైరస్ కలకలం

1
- Advertisement -

చైనాలో మరో వైరస్ కలకలం రేపింది. హ్యూమన్‌ మెటానిమోవైరస్‌ (HMPV) చాలా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. హెచ్‌ఎంపీవీతోపాటు ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కొవిడ్-19 వైరస్‌లు కూడా చైనాలో వ్యాప్తి చెందుతున్నట్లు పలువురు పోస్టులు పెడుతున్నారు.

ఈ వైరస్‌ సోకిన వారిలో కొవిడ్ తరహాల లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ ఓ పర్యవేక్షక వ్యవస్థను ప్రారంభించిందన్నది ఆ నివేదికలోని సారాంశం.

కొవిడ్‌-19 వ్యాప్తిని ఆదిలోనే గుర్తించి నిరోధక చర్యలు చేపట్టకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి అవసరమైన సూచనలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.

Also Read:‘పాంచ్ మినార్’…ఫస్ట్ లుక్

- Advertisement -