భాగ్యనగర వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చే హైదరాబాద్ మెట్రోకు ప్రజల నుండి విశేష స్పందన వస్తోంది. రోజురోజుకి ప్రయాణీకుల సంఖ్య పెరిగిపోతుండగా ఇప్పటికే రెండు రూట్లలో మెట్రో అందుబాటులోకి రాగా కీలకమైన హైటెక్ సిటీ-అమీర్ పేట రూట్‌లో మెట్రో మరికొద్దిరోజుల్లో అందుబాటులోకి రానుంది. తొలుత డిసెంబరు నాటికే సిద్ధం చేస్తామని ప్రకటించిన అధికారులు పనులు పూర్తికాకపోవడంతో ఒక్కోనెల పొడిగించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మరోసారి మార్చికి ముహుర్తం మారింది.
అమీర్ పేట నుండి హైటెక్ సిటీకి 11 కిమీల దూరం గల ఈ రూట్‌లో మెట్రోను ఫిబ్రవరి నెలాఖరుకల్లా ప్రారంభిస్తామని భద్రతా పరీక్షలు కొనసాగుతుండటంతో మార్చినెలాఖరుకు మెట్రో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఐటీ కేంద్రానికి అనుసంధానంగా ఉండటంతో ఈ రూట్‌లో మెట్రో ప్రారంభం ఐటీ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
అమీర్‌పేట-హైటెక్‌సిటీ రూట్‌లో మెట్రో ప్రారంభంకావాలంటే మెట్రోరైలు సేఫ్టీ(సీఎంఆర్‌ఎస్) సెఫ్టీ సర్టిఫికెట్ తప్పనిసరి. గత వారం నుంచి తనిఖీ చేస్తున్న అధికారులు భద్రతపై సంతృప్టి వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. మార్చి మూడోవారం లేదా నాలుగోవారంలో మెట్రోను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అమీర్‌పేట-హైటెక్‌సిటీ 11 కి.మీ కాగా ప్రయాణసమయం 16 నిమిషాలు పట్టనుంది.