- Advertisement -
నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హిట్ 3. తొలి రోజు వరల్డ్‌వైడ్‌గా రూ. 43కోట్లు సాధించి నాని కెరీర్లో బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఇక రెండో రోజూ ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధించింది.
రెండో రోజే ఈజీగా రూ.50 కోట్ల మార్క్ అందుకుంది. శుక్రవారం రూ.19 కోట్లు (గ్రాస్) వసూల్ చేయగా రెండు రోజుల్లోనే హిట్ 3 వరల్డ్‌వైడ్‌గా రూ. 62 కోట్ల మార్క్ అందుకున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా పోస్టర్ రిలీజ్ చేశారు. బాక్సీఫీస్ వద్ద అర్జున్ సర్కార్ వేట కొనసాగుతోంది అని క్యాప్షన్ రాసుకొచ్చారు.
ముఖ్యంగా బుక్ మై షో లో నాని సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓపెనింగ్ రోజు 2.70 లక్షల టికెట్లు అమ్ముడవ్వగా, డే 2న 2.06 లక్షల టికెట్లు సోల్డ్ అయినట్లు బుక్ మై షో పేర్కొంది.
Also Read:జాజికాయ పొడితో ఆరోగ్యం!
- Advertisement -

