హిస్టరీ రిపీట్..శివ తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్

243
rgv on laxmis ntr
- Advertisement -

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకి రాగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో స్పందించారు ఆర్జీవీ. హిస్టరీ రీపిట్ అయిందని ట్వీట్టర్ ద్వారా ట్వీట్ చేసిన వర్మ..1989లో శివ,2019లో లక్ష్మీస్ ఎన్టీఆర్ మైలురాయి అంటూ ట్వీట్ చేశారు. తెలుగు దేశం స్థాపించ‌బ‌డ్డ రోజే (మార్చి 29,1982) త‌న సినిమా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ కూడా విడుద‌ల‌క కావ‌డం యాదృచ్చికంగా ఉంద‌ని అన్నాడు.

ఎన్టీఆర్ జీవితంలోకి ల‌క్ష్మీ పార్వ‌తి వ‌చ్చిన త‌ర్వాత ఏం జ‌రిగింది, సీఎం పదవి ఏ ప‌రిస్థితుల‌లో పోగొట్టుకోవ‌ల‌సి వ‌చ్చింది, కుటుంబ స‌భ్యులు ఎందుకు దూరమయ్యారు అనే నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు వర్మ. విడుదలకు ముందే వివాదాలకు కేరాఫ్‌గా మారడం,సెన్సార్ బోర్డుతో వర్మ ఫైట్‌తో సినిమాకు మరింత ప్రమోషన్ లభించింది.

అంచనాలకు తగ్గట్టే లక్ష్మీస్ ఎన్టీఆర్ విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది. చాలాకాలం తర్వాత ఆర్జీవీ మార్క్ మూవీ అంటూ ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. ఇక సినిమా విడుదలకు ముందు ఆర్జీవీ చేసిన వరుస ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

- Advertisement -