నటితో అతని బంధం అదే

42
- Advertisement -

సీనియర్ నటి తులసితో కమెడియన్ ప్రభాస్ శ్రీనుకి ఏదో ఉందని గత ఏడాదిగా అనేక రకాలుగా పుకార్లు వచ్చాయి. ఆలీతో సరదాగా షోకి వీరిద్దరి కలిసి వచ్చారు. వీరిది ఒకే ఏజ్ కాదు. పైగా ఇద్దరూ కలిసి ఎక్కువ సినిమాలు కూడా చేయలేదు. మరి ప్రభాస్ శ్రీనుతో తులసి షో చేయడమేంటనే సందేహాలు నెటిజన్స్ లో వచ్చాయి. దాంతో నటి తులసితో ప్రభాస్ శ్రీను రిలేషన్ లో ఉన్నారని.. తులసి తన భర్తకు విడాకులు కూడా ఇవ్వబోతుంది అని, ప్రభాస్ శ్రీనుతోనే ఆమె ఎక్కువగా కలిసి ఉంటుందని.. ఇలా చాలా గాసిప్ లు వైరల్ అయ్యాయి.

ఓ దశలో అయితే, ప్రభాస్ శ్రీను ద్వారా నటి తులసి గర్భవతి కూడా అయిందని ప్రచారం చేశారు. ఆ తర్వాత ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు అని తేల్చారు అనుకోండి. మొత్తమ్మీద ఈ వార్తలపై తాజాగా ప్రభాస్ శ్రీను స్పందించారు. ‘నాకు తులసికి ఎలాంటి సంబంధం లేదు. నిజానికి తులసి నాకు తల్లి లాంటిది. కానీ, మాపై తప్పుడు కథనాలు రాశారు. ఆ వార్తల్లో అసలు నిజం లేదు. నిజానికి డార్లింగ్ మూవీ షూటింగ్ సమయంలో ఆమెను కేరింగ్ గా చూసుకున్నాము. ఆమె సీనియర్ నటి. అందుకే గౌరవం ఇచ్చాం.

Also Read: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ టార్గెట్ అదే

నేను కూడా ఆమెతో అభిమానంగా ఉండేవాడిని. ఈ క్రమంలోనే షూటింగ్ లో ఆమె నన్ను సరదాగా డార్లింగ్ అని పిలిచారు. దాని కొందరు అపార్థం చేసుకున్నారు. మాపై ఎఫైర్ రూమర్స్ మొదలయ్యాక తులసి గారు నాకు మెసేజ్ పెట్టారు. మీ భార్యకు వీటి గురించి చెప్పు లేదంటే ఆవిడ కూడా అపార్థం చేసుకుంటుందని సలహా ఇచ్చారు. కానీ, నా భార్యకు మా మధ్య బంధం ఏమిటో తెలుసు అని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చాడు.

Also Read: ఆమె అందం యూత్ కి ఎనర్జీ అట

- Advertisement -