ముస్లింలకు అతి పవిత్రమైన పండగ రంజాన్. ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాసదీక్షలు చేపడతారు. సాయంత్రం ఉపవాస దీక్ష విరమణలో వారు తీసుకునే ఆహారాన్ని ఇఫ్తార్ అంటారు. ఈ ఇఫ్తార్ విందును హిందూదేవాలంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు కేరళ హిందూవులు.
మలపురం జిల్లాలోని వెట్టిచిరియంలో ఉన్న లక్ష్మీ నరసింహా్మూర్తి గుడిలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో సుమారు 400 మంది ముస్లింలు పాల్గొన్నారు. అయితే ఆలయంలో విగ్రహ ప్రతిష్ట జరిగిన రోజున ప్రతి సంవత్సరం అన్నధానం నిర్వహిస్తామని, కావున ఈ సారి రంజాన్ మాసం రావడంతో ముస్లిం సోదరులను ఆహ్వానించి…. ఇఫ్తార్ విందు ఇచ్చినట్లు ఆలయ కమిటీ కార్యదర్శి కేపీ బైజూ తెలిపారు. ఈ ఇఫ్తార్ విందులో హిందూ-ముస్లింలు కలిసి మతసామరస్యాన్ని ప్రతీకగా నిలిచారు.
మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ మతసామరస్యానికి ప్రతీకగా హిందూ-ముస్లిం సోదరులు కలిసి హలీం తయారీలో పాల్గొంటారు . ఇక హైదరాబాద్ లో హలీం తయారీ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. మరోవైపు హలీం ప్రియులు లొట్టలు వేసుకుంటూ లాగించేస్తున్నారు.