హిందీలో ఆగని కల్కి జోరు!

36
- Advertisement -

విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నం ఓపస్ ‘కల్కి 2898 AD’. ఈ విజువల్ వండర్ లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె లీడ్ రోల్స్ లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ జూన్ 27న గ్రాండ్ గా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షులని మహా అద్భుతంగా అలరించి, ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది.

హిందీ మార్కెట్ లో కూడా ఈ చిత్రం భారీ వసూళ్లతో దూసుకెళ్తుంది. బుధవారం ఒక్కరోజే హిందీ వెర్షన్ లోనే ఈ చిత్రం 4.3 కోట్ల నెట్ వసూళ్లు అందుకోగా ఇప్పటివరకు హిందీలో రూ. 228.7 కోట్ల నెట్ వసూళ్ల మార్క్ అందుకొని రూ.250 కోట్ల మార్క్ దిశగా వెళుతుంది.

Also Read:‘కన్నప్ప’.. తిన్నడు విల్లు విశేషాలు

- Advertisement -