వయసు చిన్నదే కానీ మనసు మాత్రం పెద్దది.తాతకు తగ్గ మనవడిగా ఆయన అడుగుల్లో అడుగువేస్తూ ఓ అభాగ్యుడికి అపన్నహస్తం ఇచ్చేందుకు వచ్చారు.అతనే ఎవరోకాదు తెలంగాణ బాపు,సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు.
12 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో భద్రాచలానికి చెందిన నూకసాని శ్రీనివాసరావు వెన్నుపూసకు తీవ్ర గాయమైంది. అప్పటి నుంచి మంచానికే పరిమితమైన శ్రీనివాస్ తన బాధను యూట్యూబ్‌ని చెప్పుకున్నారు. కేసీఆర్ మూడు వేల పింఛన్ ఇవ్వకున్నా పర్వాలేదని, ఇప్పుడిస్తున్న దానితోనే తమ కడుపు నిండుతోందని, మళ్లీ కేసీఆరే సీఎం కావాలని ఆకాంక్షించాడు.
ఈ వీడియోను చూసి చలించిన హిమాన్షు భద్రాచలంలో తమకు తెలిసిన వారి ద్వారా శ్రీనివాస్ వివరాలను తెప్పించుకున్నారు. అతడి పరిస్థితి గురించి తెలుసుకుని చలించిపోయారు. అతడికి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. హిమాన్షు హామీ మేరకు శ్రీనివాసరావు చికిత్స కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తాత కేసీఆర్‌తో మాట్లాడి పూర్తిస్థాయిలో సాయం అందించేందుకు కృషి చేస్తానని హిమాన్షు తమతో చెప్పినట్టు శ్రీనివాస్ భార్య తెలిపారు. మొత్తంగా తాతకు తగ్గ మనవడిగా తండ్రికి తగ్గ తనయుడిగా చిన్నవయసైనా హిమాన్షు స్పందించిన తీరుపట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.