అమెరికా ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. యూఎస్ న్యూహాంప్ షైర్‌లోని మూడు ప్రాంతాల్లో ముందుస్తు పోలింగ్ ముగిసింది. రెండు ప్రాంతాల్లో హిల్లరీ,ఒక ప్రాంతంలో ట్రంప్ గెలుపొందారు మూడు ప్రాంతాల్లో కలిపి 57 ఓట్లు పోలవ్వగా…ట్రంప్‌కు 32,హిల్లరీ 25 ఓట్లు వచ్చాయి. డిక్స్ విల్లే, హార్ట్స్ పట్టణాల్లో హిల్లరీ గెలుపొందగా…మిల్స్ ఫీల్డ్ పట్టణంలో ట్రంప్ గెలుపొందారు.
కెనడా సరిహద్దు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వూరిలో 24 గంటల ముందుగానే తొలి ఫలితం వెలువడుతుంది. ఎందుకంటే ఇక్కడ అర్థరాత్రి పోలింగ్ మొదలవుతుంది. అధ్యక్ష ఎన్నికల్లో ఇక్కడే పోలింగ్ ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తోంది. అమెరికాలో 12 గంటల పాటు పోలింగ్ జరిగిన తర్వాత ఒక్కో రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాలను మూసేస్తారు. ఆ వెంటనే కౌంటింగ్ మొదలవుతుంది. టైమ్ జోన్లు వేర్వేరుగా ఉండడం వల్ల ఒక చోట ఫలితాలు వెలువడుతున్న సమయానికి మరో రాష్ట్రంలో పోలింగ్ కొనసాగుతూనే ఉంటుంది. భారతకాలమానం ప్రకారం రేపు ఉదయాన్ని కల్లా అన్ని రాష్ట్ర్రాల్లో ఫలితాలు వెల్లడికానున్నాయి. అర్దరాత్రి డిక్స్‌విల్లిలో జరిగిన ఎన్నికల ఫలితాల్లో హిల్లరి బోణి కొట్టింది. ట్రంప్‌పై 2 ఓట్ల తేడాతో ఖాతా తెరిచింది.
అమెరికా అధ్యక్ష ప్రక్రియ ఓ వైపు ప్రారంభంకాగాగా,,,,తాజాగా వెలువరించిన తుది సర్వే ఫలితాలు మాత్రం హిల్లరీ కే పట్టం కడుతున్నాయి. హిల్లరీ గెలుపు ఖాయమంటూ వెల్లడించింది. హిల్లరీకి 90 శాతం గెలిచే అవకాశాలున్నాయని, ట్రంప్నకు షాక్ తప్పదంటూ రాయిటర్స్/ఇప్సాస్ స్టేట్స్ ఆఫ్ ద నేషన్ నిర్వహించిన సర్వేలో తేలింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో మొదట్నుంచి హిల్లరీయే ముందంజలో ఉన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు, మహిళలపై అనుచితంగా ప్రవర్తించినట్టు ఆరోపణల కారణంగా ట్రంప్ వెనుకబడిపోయారు. ఆ తర్వాత పోటీ హోరాహోరీగా మారిందని, ఓ దశలో ట్రంపే స్వల్ఫ తేడాతో ముందున్నారంటూ సర్వేలు చెప్పాయి.
కాగా ఎన్నికల తేదీ సమీపించేసరికి పరిస్థితి హిల్లరీకి పూర్తిగా అనుకూలంగా మారింది. ఈ మెయిల్స్ వ్యవహారంలో ఎఫ్బీఐ క్లీన్ చిట్ ఇవ్వడం కూడా ఆమెకు కలసివచ్చింది. ఇంతకు ముందు హిల్లరీ గెలిచే అవకాశం 64 శాతం ఉందని సర్వేలు తేల్చగా, తాజా, తుది సర్వేలో విజయావకాశాల శాతం 90కి పెరిగింది. ఇక వైట్ హౌస్ రేసులో ట్రంప్ ఆశలు రోజురోజుకు సన్నగిల్లిపోతున్నాయి. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నిక కావాలంటే ఎలెక్టోరల్ కాలేజీలో 270 ఓట్లు అవసరం కాగా… హిల్లరీ 303 ఓట్లతో తిరుగులేని మెజార్టీ సాధిస్తారని సర్వేలో తేలింది. ట్రంప్కు 235 ఓట్లు మాత్రమే వస్తాయని వెల్లడించింది. ఓవరాల్‌గా ఓట్లు హిల్లరీకి 45 శాతం, ట్రంప్కు 42 శాతం వస్తాయని అంచనా వేసింది.