మండుతున్న ఎండలు.. జంకుతున్న జనం..

415
High Temperature
- Advertisement -

తెలుగు రాష్ట్రంలో ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతల్లో 3 నుంచి 4 డిగ్రీల చొప్పున పెరుగుదల నమోదవుతోంది. ఫిబ్రవరి చివరి వారం నుంచే భానుడి భగభగలు మొదలవడంతో జనం ఇక్కట్లు పడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఎండకు జనం రోడ్డెక్కాలంటెనే జంకుతున్నారు. ఫిబ్రవరిలోనే మూడు, నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదుకు కారణం గాలిలో తేమ తగ్గడమేనని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ వేసవిలో రాష్ట్రంలో చాలాచోట్ల 46 నుండి 47 డిగ్రీల టెంపరేచర్స్ రికార్డయ్యే సూచనలున్నాయని విశ్లేషించారు. ఏప్రిల్, మే నెలలో వర్షాలు పడే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.

High Temperature

ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ఫిబ్రవరిలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడమే అందుకు నిదర్శనమని వాతావరణ శాఖ పేర్కొంటోంది. 2016లో వేసవి కాలంలో ఎలాంటి వడగాలులు వీచాయో.. అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. 2018లో కేవలం 7 రోజులు మాత్రమే వడగాలులు వీచాయని, ఈ ఏడాది మాత్రం అధికంగా వడగాలులు వీస్తాయని తెలిపింది. ఇంకా మూడు నెలలో మరింతగా ఊష్ణోగ్రతలు పెరుగనున్నాయి.

ఈ వేసవిలో జూన్‌ వరకు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉండటంతో ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ గా ఉండాలని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ఏడాది ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మొత్తానికి ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశాలున్నాయి కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. మొత్తానికి ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశాలున్నాయి కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -