డాక్టర్లపై దాడి నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్న డాక్టర్ల ఘటనపై స్పందించిన కేటీఆర్…దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
డాక్టర్లపై దాడులు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తూనే 200 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేసింది. గాంధీ ఆస్పత్రి పరిసరాలతో పాటు 5,6,7,8 అంతస్తుల్లో పోలీసులను మోహరించారు.
కరోనా మహమ్మారి విజృభిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం గాంధీలో కరోనా కేసులు తప్ప మామూలు ఓపీ చూడటం లేదు. దీంతో ఆస్పత్రికి వస్తున్న కరోనా రోగుల బంధవులు డాక్టర్లు,సిబ్బందితో దరుసుగా ప్రవర్తిస్తున్నారు. గొంతెమ్మ కొర్కేలతో డాక్టర్లకు ఇబ్బందులు సృష్టించడమే కాదు దాడులు కూడా చేస్తున్నారు. ఈనేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం…డాక్టర్లపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.